ETV Bharat / bharat

గిరిజన బాలికలపై గ్యాంగ్​ రేప్​.. జాతరకు వెళ్లి వస్తుండగా దారుణం..!

author img

By

Published : Apr 20, 2023, 7:12 PM IST

Updated : Apr 20, 2023, 8:35 PM IST

ఒడిశాలో మరోసారి కామాంధులు రెచ్చిపోయారు. జాతరను చూసి ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు గిరిజన​ బాలికలపై ఐదుగురు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Gang Rape On Two Minor Tribal Girls In Odisha
ఒడిశా కలహండిలో ఇద్దరు గిరిజన మైనర్​ బాలికలపై గ్యాంగ్​ రేప్​

ఒడిశా.. కలహండి జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. ఇద్దరు గిరిజన​ బాలికలపై ఐదుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా జరిగే జాతరను చూసి ఇంటికి తిరిగి వెళ్తుండగా బాధితులపై నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఏప్రిల్​ 16న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రామ పెద్దల సహాయంతో బాధిత కుటుంబ సభ్యులు ఏప్రిల్​ 19న బీజేపుర్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై ఫిర్యాదు చేశారు. కాగా.. అత్యాచారానికి గురైన బాలికల వయసు 14 నుంచి 17 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై పోక్సో చట్టం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు బీజేపుర్ పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది..
ఏప్రిల్​ 16న ముగ్గురు బాలికలు స్థానికంగా జరిగే జాతరను చూసేందుకు వెళ్లారు. జాతర అనంతరం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఐదుగురు యువకులు వారిని వెంబడించారు. కొద్దిదూరం వెళ్లాక నిందితులు.. ఇద్దరు మైనర్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాగా, మరో బాలిక తప్పించుకొని దగ్గర్లోని చెట్టు వెనుక దాక్కుంది.

ఘటనాస్థలి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. అంతేకాకుండా అటవీ విస్తీరణం కూడా గణనీయంగా ఉండటం వల్ల నిందితులు దట్టమైన అడవిలో దాక్కుని ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. బాధితులకు.. గురువారం భవానీపట్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చేయకపోతే నిరసనలకు దిగుతామని కలహండి ఆదివాసీ సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ మాఝీ హెచ్చరించారు.

మహిళపై సర్పంచ్​ రేప్​..?
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మహిళపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో ఓ సర్పంచ్​ను అరెస్టు చేశారు పోలీసులు. బాధితురాలు రఫియాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల సర్పంచ్ అలీ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

22 ఏళ్ల యువతిపై అత్యాచారం..!
ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని 22 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ప్రతిఘటించడం వల్ల నిందితుడి నుంచి తప్పించుకోగలిగానని పేర్కొంది. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్​లో బుధవారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించిన యువకుడు ఖుష్వంత్​ బాధితురాలికి ముందే తెలుసని పోలీసులు తెలిపారు. నిందితుడు బాధితురాలిని సెక్టార్ 33లోని హౌసింగ్ బోర్డు కాలనీకి పిలిపించి అత్యాచారానికి యత్నించాడని ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. నేరం రుజువైతే చట్టప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ విజేత తెలిపారు.

Last Updated : Apr 20, 2023, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.