ETV Bharat / bharat

వారాంతపు లాక్​డౌన్​- రహదారులు నిర్మానుష్యం!

author img

By

Published : Apr 25, 2021, 11:12 AM IST

కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్​డౌన్ దిశగా అడుగులేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాలు, వీధులు బోసిపోయాయి. రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

weekend lockdown
వారాంతపు లాక్​డౌన్, కర్ఫ్యూ

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు వారాంతపు లాక్​డౌన్​లు, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే..

జమ్ముకశ్మీర్​- శ్రీనగర్​లో..

ఏప్రిల్​ 26 ఉదయం 6 గంటల వరకు జమ్ముకశ్మీర్​లో వారాంతపు​ కర్ఫ్యూ అమలైంది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో నగరాలు, వీధులు నిర్మానుష్యంగా మారాయి.

weekend lockdown
శ్రీనగర్​లో బోసిపోయిన వీధులు
weekend lockdown
మూతపడిన దుకాణాలు

నిత్యవసరాలకు గుమిగూడి..

కర్ణాటక శివమొగ్గ ప్రాంతంలో నిత్యవసర వస్తువులు కొనేందుకు ప్రజలు గుమిగూడారు. వారాంతపు లాక్​డౌన్​ నేపథ్యంలో 6 గంటల నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరవనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలివ్వడం వల్ల మార్కెట్లో విపరీతంగా జనం కనిపించారు.

weekend lockdown
కర్ణాటకలో వారాంతపు లాక్​డౌన్
weekend lockdown
శివమొగ్గ మార్కెట్​లో

యూపీలో..

ఉత్తర్​ప్రదేశ్ గోరఖ్​పుర్​లో వారాంతపు లాక్​డౌన్ నేపథ్యంలో పోలీసులు రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్నవారినే బయటతిరిగేందుకు అనుమతి ఇస్తున్నారు.

weekend lockdown
యూపీలో వాహనాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
weekend lockdown
అనుమతి ఉంటేనే..

బ్యూటీ పార్లర్లు మూసివేత..

తమిళనాడులో ఆదివారం విధించిన సంపూర్ణ లాక్​డౌన్ నేపథ్యంలో రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. ఏప్రిల్ 26 నుంచి బ్యూటీ పార్లర్లు, సెలూన్లు ఇతర దుకాణాలు మూసివేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

weekend lockdown
తమిళనాడులో వారాంతపు లాక్​డౌన్
weekend lockdown
నిర్మానుష్యంగా కనిపిస్తున్న రహదారి

ఆరు రోజుల లాక్​డౌన్​లో

దిల్లీలో వారం రోజుల లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు రహదారులపై వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్నవారికే బయటతిరిగేందుకు అవకాశమిస్తున్నారు.

weekend lockdown
దిల్లీలో వారం రోజుల లాక్​డౌన్

ఇదీ చదవండి:'కరోనాపై పోరులో భారత్​కు అండగా ఉంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.