ETV Bharat / bharat

ఎన్నికల కమిషనర్ల నియామకాలకు కొత్త విధానం.. కమిటీలో సీజేఐకి బదులు కేబినెట్ మంత్రి!

author img

By

Published : Aug 10, 2023, 3:19 PM IST

Updated : Aug 10, 2023, 3:46 PM IST

Election Commission Bill 2023 : చీఫ్​ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకాలపై కేంద్రం కొత్త బిల్లు తీసుకొచ్చింది. వీరి ఎంపిక ప్యానెల్​లో భారత ప్రధాన న్యాయమూర్తిని తీసేసి.. ఆ స్థానంలో ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్​ మంత్రి ఉండేలా తీసుకొచ్చిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

Election Commission Bill 2023
Election Commission Bill 2023

Election Commission Bill 2023 : కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై కేంద్రం కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన చీఫ్​ ఎలక్షన్ కమిషనర్- సీఈసీ​, ఎలక్షన్ కమిషనర్ల (నియామకాలు, సర్వీసుల కండీషన్లు, పదవీకాలం) బిల్లు, 2023ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్​మేఘ్వాల్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టంతో నియామక ప్యానెల్‌ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్‌ చేసిన కేంద్ర కేబినెట్‌ మంత్రి ఒకరు సభ్యులుగా ఉండనున్నారు.

Election Commission Selection Panel : ఎన్నికల సంఘంలో నియామకాలను త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ ప్యానెల్‌కు ప్రధాని నేతృత్వం వహిస్తారని బిల్లులో పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఉండాలని మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ బిల్లు.. ఆ తీర్పునకు వ్యతిరేకంగా ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల కమిషన్‌లో ఒక ఖాళీ ఏర్పడనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఎలక్షన్‌ కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేయనున్నారు.

'ప్రధాని చేతిలో తోలు బొమ్మలా ఈసీ..'
Election Commissioner Appointment Controversy : ఈ బిల్లుపై కాంగ్రెస్​, ఆప్ సహా విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలను ఈ బిల్లు నీరుగార్చిందని ఆరోపించాయి. ఈ బిల్లును బీజేడీ, వైఎస్​ఆర్​సీపీ కూడా వ్యతిరేకిస్తాయా? అని ప్రశ్నించాయి. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఎన్నికల సంఘాన్ని నియంత్రించాలనుకుంటున్నారని.. ఈ బిల్లు ఈసీని వారి చేతిలో తోలుబొమ్మలను మారుస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు గుప్పించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయమని.. ఎన్నికల పారదర్శకతపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆప్​ జాతీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.

'ఆ కమిటీ సిఫార్సు మేరకే ఎన్నికల కమిషనర్ల నియామకం'.. సుప్రీం కీలక ఆదేశాలు

ఎన్​ఆర్​ఐలకు గుడ్​న్యూస్.. త్వరలో 'పోస్టల్​ బ్యాలెట్'​ సౌకర్యం!

Last Updated : Aug 10, 2023, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.