ETV Bharat / bharat

'పంజాబ్​ లోక్​ కాంగ్రెస్ పార్టీ' నమోదు కోసం ఈసీకి దరఖాస్తు

author img

By

Published : Nov 15, 2021, 6:39 PM IST

పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ పేరుతో ఓ రాజకీయ పార్టీని గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు అందింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Punjab Lok Congress
అమరీందర్ పార్టీకి షాక్

'పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​' పేరిట రాజకీయ పార్టీని నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ దరఖాస్తు అందింది. దీనిని ఈసీ పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

"ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓ అసోసియేషన్​ను పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ పేరుతో పొలిటికల్​ పార్టీగా గుర్తించాలని ఆ సంస్థ దరఖాస్తు చేసుకుంది. దీనిని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది."

- సంబంధిత వర్గాలు

ఇటీవల కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసి, ఇదే పేరుతో పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ (amarinder singh news) పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు.

పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూతో విభేదాల నేపథ్యంలో సెప్టెంబర్​లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కెప్టెన్ అమరీందర్​​. ఈ క్రమంలోనే గాంధీ కుటుంబం తనను అవమానించిందని ఆరోపించారు. దీంతో 'పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​' (amarinder singh party) పేరిట సొంత పార్టీని ప్రకటించారు. అయితే.. ఈసీకి అందిన దరఖాస్తుకు, అమరీందర్​కు సంబంధం ఉందా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

ఇదీ చూడండి: హైవేపై దిగిన మూడు యుద్ధవిమానాలు- ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.