ETV Bharat / bharat

DRDO Recruitment 2023 : రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూనే.. రూ.37వేల జీతం!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 5:20 PM IST

DRDO Recruitment 2023 : ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO).. కాంట్రాక్ట్ పద్ధతిలో.. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) స్థానాన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

DRDO Recruitment 2023
DRDO Recruitment 2023

DRDO Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్‌డీఓ కాంట్రక్ట్‌ ప్రాతిపదికన ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌లో కలిపి నాలుగు జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) స్థానాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకోసం ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు మొదటి రెండు సంవత్సరాలు జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)గా పని చేస్తారు.

DRDO JRF Recruitment 2023 Notification : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం రూ.37000, ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. దరఖాస్తుదారులను గేట్ స్కోర్‌లో చూపిన ప్రతిభ, వారి కనీస అర్హత డిగ్రీలలో పొందిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇంటర్వ్యూ సమయంలో, అభ్యర్థులు తగిన అన్ని పత్రాలనూ సమర్పించాలి.

DRDO JRF Recruitment : ఉద్యోగాల వివరాలు

విద్యార్హతలు

  • జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం (ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) :
  • నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో BE/BTech మొదటి శ్రేణిలో పాస్‌ అయి, NET/GATE ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
  • అభ్యర్థులు M.E/M.Tech ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో పూర్తి చేసి ఉండాలి. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి.. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
  • జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం (ఫిజిక్స్‌లో)
  • అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో మొదటి శ్రేణిలో M.E./M.Tech/B.Tech/B.E పాస్‌ అయి, NET/GATE ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
  • అభ్యర్థులు M.E/M.Tech ఫిజిక్స్‌ విభాగంలో పూర్తి చేసి ఉండాలి.
  • యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :

  • అభ్యర్థులు గేట్‌ స్కోర్‌లో చూపిన ప్రతిభ, అకాడమిక్‌ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.

DRDO JRF Recruitment Notification : జీతభత్యాలు

  • డీఆర్‌డీఓ జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) గా ఎంపికైన వారికి నెలకు రూ.37,000 జీతం అందిస్తారు. HRA అదనంగా ఇస్తారు.

వయోపరిమితి :

  • జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఉద్యోగాలకు గరిష్ఠ పరిమితి దరఖాస్తు గడువు నాటికి 28 సంవత్సరాలు. SC/ST, OBC అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది.

DRDO JRF Recruitment 2023 Notification : దరఖాస్తు విధానం
ఇది ఆఫ్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌. అభ్యర్థులు DRDO అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తరవాత దరఖాస్తును పూర్తిగా నింపి, అన్ని ఎన్‌క్లోజర్‌లతో కలిపి, డైరెక్టర్, IRDE, డెహ్రాడూన్‌కు పంపాలి. అభ్యర్థులు ఎన్వలప్ కవర్ పైన జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) రిక్రూట్‌మెంట్‌ కోసం దరఖాస్తు అని క్యాపిటల్‌ లెటర్స్‌లో రాయాలి. అసంపూర్తిగా/ పాక్షికంగా పూరించిన దరఖాస్తులు తిరస్కరిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ రిక్రూట్‌మెంట్‌ ప్రకటన ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రచురించిన 21 రోజుల తర్వాత ముగుస్తుంది.

DRDO Jobs 2023 : ఇంజినీరింగ్ అర్హతతో.. డీఆర్​డీఓలో ఐటీఆర్​, సైంటిస్ట్-బి ఉద్యోగాలు.. అప్లైకు మరో 2 రోజులే ఛాన్స్!

DRDO Jobs Notification 2023 : DRDOలో సైంటిస్ట్‌ జాబ్స్​.. రూ.లక్షకుపైనే జీతం.. బీటెక్​ చేస్తే చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.