ETV Bharat / bharat

DRDO Jobs Notification 2023 : DRDOలో సైంటిస్ట్‌ జాబ్స్​.. రూ.లక్షకుపైనే జీతం.. బీటెక్​ చేస్తే చాలు!

author img

By

Published : Aug 16, 2023, 11:44 AM IST

Updated : Aug 16, 2023, 11:51 AM IST

DRDO Jobs Notification 2023 : ఇంజినీరింగ్​ గ్రాడ్యుటేట్​లకు గుడ్​న్యూస్​ వినిపించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్​డీఓ. భారీ వేతనాలతో కూడిన సైంటిస్ట్​ 'బి' ఉద్యోగాలకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మరి ఏయే విభాగంలో ఎన్ని పోస్టులు? వేతనం ఎంత? దరఖాస్తు చివరితేదీ ఎప్పుడు? ఎవరు అర్హులు? వంటి పూర్తి వివరాలు మీ కోసం.

DRDO Recruitment 2023
Engineering Jobs 2023 DRDO Jobs Notification 2023

DRDO Jobs Notification 2023 : బీటెక్​ పూర్తి చేసి గేట్​లో మంచి స్కోరు సాధించి సైంటిస్ట్​ కొలువుల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్​ విద్యార్థులకు శుభవార్త. మంచి జీతంతో కూడని సైంటిస్ట్‌ 'బి' ఉద్యోగాలకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). అర్హత (DRDO Scientist B Eligibility) ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

మొత్తం ఖాళీలు..

  • 204 సైంటిస్ట్​ 'బి' పోస్టులు

విభాగాల వారీగా..

  • డీఆర్‌డీఓ- 181
  • ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ)- 6
  • కాలేజ్‌ ఆఫ్‌ మిలటరీ ఇంజినీరింగ్‌(సీఎంఈ)- 6
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ)- 11

వయో పరిమితి​..

  • ఎస్సీ, ఎస్టీలు- 40 ఏళ్లు
  • ఓబీసీ-నాన్‌ క్రిమీలేయర్‌- 28 ఏళ్లు
  • అన్‌రిజర్వుడ్‌/ఈడబ్ల్యూఎస్‌- 35 ఏళ్లు మించరాదు.

అప్లికేషన్​ ఫీజు..

  • ఈడబ్ల్యూఎస్‌, జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు- రూ.100/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

దరఖాస్తు చివరితేదీ..

  • 2023 ఆగస్టు 31

జీతభత్యాలు..
DRDO Scientist B Salary : డీఆర్​డీఓలో ఉద్యోగం చేసే సైంటిస్టులకు భారీగానే జీతభత్యాలు ఉంటాయి. ఇవి సదరు హోదాలపై ఆధారపడి ఉంటాయి. అయితే సాధారణంగా ఒక్కో శాస్త్రవేత్తకు రూ.లక్షపైనే వేతనం చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ..
DRDO Scientist B Selection Process : పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు గేట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. అర్హులైన అభ్యర్థులు సాధించిన గేట్‌ స్కోరు ఆధారంగా 1:10 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. కాగా, ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ఇందుకోసం అఫిషియల్​ వెబ్​సైట్​ను చూడండి.

ఎంత వెయిటేజీ?

  • గేట్‌లో స్కోరుకు 80శాతం వెయిటేజీ
  • పర్సనల్‌ ఇంటర్వ్యూకు 20శాతం వెయిటేజీ

జాబ్​ లొకేషన్​..
DRDO Scientist B Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్​సైట్​..
DRDO Scientist B Website : వయోపరిమితి సడలింపులు, సిలబస్​ వంటి సమగ్ర సమాచారం కోసం సంస్థ అధికారిక వెబ్​సైట్​ www.drdo.gov.in ను చూడొచ్చు.

Western Coalfields Ltd Recruitment 2023 : ఇటీవలే 1191 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ నోటిఫికేషన్​ను విడుదల చేసింది వెస్ట్రన్​ కోల్​ఫీల్డ్స్​ లిమిటెడ్. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబరు 16 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నియమకాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Engineering Jobs 2023 : ఐటీఐ, ఇంజినీరింగ్ అర్హతతో.. 531 నాన్​-ఎగ్జిక్యూటివ్​ ఉద్యోగాలు!

Engineering Jobs 2023 : ఐటీఐ, డిప్లొమా అర్హతతో.. 1191 అప్రెంటీస్​ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

Last Updated : Aug 16, 2023, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.