ETV Bharat / bharat

పెంపుడు కుక్కకు గుడి.. ప్రతి శుక్రవారం పూజలు

author img

By

Published : Apr 6, 2022, 12:57 PM IST

Updated : Apr 6, 2022, 3:51 PM IST

Dog Temple in Tamil Nadu: కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి ఆకస్మికంగా దూరమైన పెంపుడు శునకానికి ఓ వృద్ధుడు గుడి కట్టించారు. ప్రతి శుక్రవారం దానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పెంపుడు కుక్కకు గుడి కట్టి పూజలు చేస్తున్న ఆ పెద్దాయన ఎవరు? ఈ సంఘటన ఎక్కడ జరిగింది?

Dog Temple in Tamil Nadu
పెంపుడు శునకానికి ఆలయం

పెంపుడు కుక్కకు గుడి.. ప్రతి శుక్రవారం పూజలు

Dog Temple in Tamil Nadu: పెంపుడు జంతువులపై కొందరు వీడదేయలేని మమకారాన్ని పెంచుకుంటారు. సొంత బిడ్డలకన్నా ఎక్కువగా వాటిని ప్రేమిస్తారు. ఎప్పుడూ వాటితోనే గడుపుతుంటారు. అవి దూరమైతే తట్టుకోలేరు. అలాంటి ఓ పెద్దాయన.. తన పెంపుడు శునకంపై ఉన్న ప్రేమతో గుడి కట్టించి పూజలు చేస్తున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో జరిగింది.

జిల్లాలోని మనమదురయ్​కి చెందిన ముత్తు అనే 82 ఏళ్ల విశ్రాంతి​ ప్రభుత్వ ఉద్యోగికి శునకాలంటే ఎంతో ప్రేమ. 12 ఏళ్ల క్రితం ఓ శునకాన్ని తీసుకొచ్చి పెంచుకున్నారు. టామ్​గా పిలుచుకునే ఆ కుక్క ఇంట్లో ఒకరిలా కలిసిపోయింది. టామ్​ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవారు కాదు ముత్తు. ఎక్కువగా దానితోనే గడిపేవారు. 2021లో అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది టామ్​. తనకు దూరమైన శునకం జ్ఞాపకాలను మరవలేకపోయిన ముత్తు విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తన పొలంలోనే గుడి కట్టి పూజలు చేస్తున్నారు.

Dog Temple in Tamil Nadu
శునకానికి పూజలు

" 2010 నుంచి టామ్​ నా దగ్గరే ఉంది. నా పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించాను. దురదృష్టవశాత్తు 2021లో అది మృతి చెందింది. ఆ తర్వాత దాని విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. గత మూడు తరాలుగా మా కుటుంబంలో ఏ ఒక్కరు శునకాలు లేకుండా లేరు. మా తాతలు, మా తండ్రి అంతా శునకాల ప్రేమికులే."

- ముత్తు

తమలో ఒకరిగా కలిసిపోయిన టామ్​ మరణం ఆకస్మికంగా జరిగిపోయిందని చెప్పారు ముత్తు కుమారుడు మనోజ్​. అనారోగ్యానికి గురైన టామ్​ చికిత్సకు స్పందించలేదని దాంతో 2021, జనవరిలో ప్రాణాలు విడిచిందని తెలిపారు. దాని కోసం ఆలయాన్ని నిర్మించాలని తన తండ్రి నిర్ణయించుకున్నారని, అందుకోసం తన పొదుపులోని రూ.80 వేలు ఖర్చు చేసినట్లు చెప్పారు. మార్బల్​ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి శుక్రవారంతో పాటు పండుగల రోజున టామ్​ విగ్రహాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించి పూజలు చేస్తామన్నారు మనోజ్​. శునకానికి ఆలయం అనే విషయం తెలిసి చాలా మంది చూసేందుకు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: ఆడపిల్ల పుట్టిందని సంబరం.. హెలికాప్టర్​లో ఇంటికి..

Last Updated : Apr 6, 2022, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.