ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్​

author img

By

Published : Nov 29, 2020, 12:04 PM IST

దిల్లీ ప్రభుత్వం అక్కడి ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఇంటి నుంచి పని (వర్క్​ ఫ్రమ్​ హోమ్​) చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఈ మేరుకు ఉత్తర్వులు జారీ చేసింది కేజ్రీవాల్​ సర్కార్​. దేశ రాజధానిలో కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది.

Delhi govt issues WFH orders for 50 pc of its non-essential services employees
అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్​

దేశ రాజధాని దిల్లీలో అత్యవసర సేవలు మినహా మిగిలిన ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఇంటి నుంచి పని(వర్క్​ ఫ్రమ్​ హోమ్) చేసే సౌకర్యం కల్పించింది అక్కడి ప్రభుత్వం. పెరుగుతున్న కేసులు, వైరస్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేజ్రీవాల్​ సర్కార్​ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల్లో కూడా వీలైనంత తక్కువ మంది ఆఫీసులలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

గ్రేడ్​ వన్​ అధికారులతో ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయి. మిగతా వారిలో 50శాతం మందికి ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉత్తర్వులు డిసెంబర్​ 31 వరకు కొనసాగుతాయి. ప్రైవేటు సంస్థలు కూడా వారి వారి ఉద్యోగులకు ఇలాంటి అవకాశం ఇవ్వాలి.

- విజయ్​ కుమార్​ దేవ్​, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: వెన్ను చూపని రైతన్న.. నాలుగో రోజూ ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.