ETV Bharat / bharat

'పిల్లల టీకాకు 'కొవిన్'లో​ రిజిస్ట్రేషన్ షురూ'

author img

By

Published : Jan 1, 2022, 11:15 AM IST

Updated : Jan 1, 2022, 1:28 PM IST

Children Vaccine Registration: దేశంలో జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వయసులోపు పిల్లలకు వ్యాక్సిన్​ పంపిణీ చేయనున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కొవిన్​ యాప్​లో తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను నమోదు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ కోరారు.

Covid Tika Registration
పిల్లలకు టీకా

Children Vaccine Registration: పిల్లలు సురక్షితంగా ఉంటేనే దేశ భవిత భద్రంగా ఉంటుందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​ మాండవియా. వ్యాక్సినేషన్​ కోసం అర్హులైన పిల్లల పేర్లను కుటుంబ సభ్యులు కొవిన్​లో రిజిస్టర్​ చేయించాలని కోరారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు పిల్లలకు టీకా అందించేందుకు కొవిన్​ పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ శనివారం(జనవరి 1) ప్రారంభమైన నేపథ్యంలో ఈ మేరకు ట్వీట్​ చేశారు.

" పిల్లలు సురక్షితంగా ఉంటేనే.. దేశ భవిష్యత్తు సురక్షితం. నూతన ఏడాది సందర్భంగా.. 15-18 ఏళ్ల వయసు పిల్లలకు కొవిడ్​-19 వ్యాక్సినేషన్​ కోసం కొవిన్​ పోర్టల్​లో రిజిస్టేషన్ ఇవాళ ప్రారంభమైంది. అర్హులైన చిన్నారుల పేర్లను నమోదు చేయాలని కుటుంబ సభ్యులను కోరుతున్నా."

- మాన్​సుఖ్​ మాడవియా.

దేశంలో ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 15-18 ఏళ్ల వయసు పిల్లలకు జనవరి 3వ తేదీ నుంచి టీకా ఇవ్వనున్నట్లు 2021, డిసెంబర్​ 25న ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అలాగే, 60 ఏళ్లు పైబడిన వారికి జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోస్​ ఇస్తామని తెలిపారు. ఈ క్రమంలో పిల్లలకు కొవాక్జిన్​ అందించాలని, అదనపు డోసులు పంపిస్తామని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి. ఎంత మేర సరఫరా చేస్తారనే విషయాన్ని త్వరలోనే తెలపనున్నారు.

రిజిస్ట్రేషన్​ షురూ..

పిల్లలకు జనవరి 3 నుంచి టీకా అందించనున్న నేపథ్యంలో కొవిన్​ పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ప్రారంభమైంది. 2007, ఆ తర్వాత పుట్టిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 15-18 వయసు పిల్లలకు టీకా అందించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. టీకా తీసుకున్నాక ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు అర గంట అక్కడే వేచి ఉండాలి. 28 రోజుల తర్వాతే రెండో డోసు తీసుకోవాలి.

15-18 పిల్లలకు కోసం ప్రత్యేకంగా టీకా కేంద్రాలు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని రాష్ట్రాలకే అప్పగించింది కేంద్రం. లేనిపక్షంలో వారి కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ఇదీ చదవండి: దేశంలో ఒక్కరోజే 22,775 మందికి కరోనా- ఒమిక్రాన్​ కలవరం

Omicron Variant: 'కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోండి'

Last Updated : Jan 1, 2022, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.