ETV Bharat / bharat

చదువుకున్న కాలేజీకి వెళ్తూ రావత్ దుర్మరణం- ఆ 4 గంటల్లో ఏం జరిగింది?

author img

By

Published : Dec 8, 2021, 5:20 PM IST

Updated : Dec 8, 2021, 6:29 PM IST

Army helicopter crash: సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్.. తాను చదువుకున్న కళాశాలకు వెళ్తూ ​ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు వెల్లింగ్టన్​లోని సైనిక కళాశాలలో జరిగే కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన హెలికాప్టర్ కుప్పకూలింది.

CDS Rawat met with accident
సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్

Army helicopter crash: తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లున్న సమంయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సైనిక కళాశాలలోనే జనరల్​ బిపిన్​ రావత్​ విద్యనభ్యసించటం గమనార్హం. చదువుకున్న కళాశాలకు వెళ్తూనే.. అనంతలోకాలకు వెళ్లటం బాధాకరం.

ఈ ప్రమాదం జరిగిన తీరు ఇలా..

  • తమిళనాడు, వెల్లింగ్​టన్​లోని సైనిక కళాశాలలో జరిగే కార్యక్రమానికి సీడీఎస్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య, పలువురు ఆర్మీ అధికారులు ఉదయం 8.47 గంటలకు దిల్లీ నుంచి కే-3602 అనే విమానంలో సులూరుకు బయలుదేరారు.
  • సూలూర్​ వైమానిక స్థావరానికి ఉదయం 11.34 గంటల ప్రాంతంలో చేరుకున్న రావత్​.. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్​ ఎంఐ-17వీ5లో వెల్లింగ్​టన్​కు 11 గంటల 48 నిమిషాలకు బయలుదేరారు. అక్కడి కళాశాలలో ఆయన మధ్యాహ్నం 2.45కి ప్రసంగించాల్సి ఉందని సమాచారం.
  • వెల్లింగ్టన్​కు చేరుకునే కొద్దిసేపటి ముందు మధ్నాహం 12.22 గంటల ప్రాంతంలో కూనూర్​ సమీపంలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురైంది. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలు పడిపోయాయి.
  • సమాచారం అందుకున్న సైనిక అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 80 శాతానికిపైగా కాలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.
  • సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​తో పాటు ఆయన భార్య, డిఫెన్స్​ అసిస్టెంట్​, సెక్యూరిటీ కమాండోలు, ఐఏఎఫ్​ పైలట్లు.. మొత్తం 14 మంది చాపర్​లో ఉన్నట్లు మధ్యాహ్నం 1.50 ప్రాంతంలో భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది.
  • ప్రమాదంపై మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అయింది. ప్రమాదంపై ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వివరించారు. సంఘటనా స్థలంలోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
  • సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో జనరల్​ బిపిన్​ రావత్ దంపతులు దుర్మరణం చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 11 మంది కూడా చనిపోయినట్లు వెల్లడించారు. పైలట్​ వరుణ్ మాత్రం గాయాలతో సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

ఇదీ చూడండి: Army chopper crash: ఆర్మీ హెలికాప్టర్​ క్రాష్​ లైవ్ వీడియో!

Last Updated :Dec 8, 2021, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.