ETV Bharat / bharat

ఇది ఈసీ ఏకాభిప్రాయమవుతుందా?

author img

By

Published : May 7, 2021, 8:21 AM IST

ec, supreme court
ఇది ఈసీ ఏకాభిప్రాయమవుతుందా?

సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్​(ఎస్​ఎల్​పీ) దాఖలు అంశంపై ఈసీలో అభిప్రాయభేదాలు తలెత్తాయి. అయితే ఇటువంటి సమయంలో ఎన్నికల సంఘంలో ఇద్దరే సభ్యులు ఉన్నప్పుడు ఈసీ దాఖలు చేసే ప్రమాణపత్రాన్ని ఒకరే ఆమోదిస్తే అది పరిపూర్ణ అభిప్రాయంగా పరిగణించవచ్చా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల సంఘం (ఈసీ)లో ఇద్దరే ఉన్నప్పుడు.. అది దాఖలు చేసే ప్రమాణపత్రాన్ని అందులో ఒకరే ఆమోదిస్తే దాన్ని ఈసీ పరిపూర్ణ అభిప్రాయంగా పరిగణించవచ్చా? ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మీడియాపై నియంత్రణ తదితర అంశాలపై మద్రాస్​ హైకోర్టులో తొలుత విజ్ఞాపన.. అనంతరం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్​(ఎస్​ఎల్​పీ) దాఖలు అంశాలపై ఈసీలో అభిప్రాయభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మీడియాపై నియంత్రణ అంశానికి వ్యతిరేకంగా ఎన్నికల కమిషనర్లలో ఒకరు అభ్యంతరం తెలిపినప్పటికీ దాన్ని పట్టించుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీడియాది సానుకూల పాత్రేనని ఈసీలోని ప్రతిఒక్కరూ భావిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేయాలని చూస్తోంది. ఈ వ్యవహారంపై మద్రాస్​ హైకోర్టులో ఈసీ ప్రమాణపత్రాన్ని దాఖలు చేయాలని.. సంస్థగా తాను వేరువేరుగా ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని అభ్యంతరం తెలిపిన ఎన్నికల కమిషనర్​ భావించినా ఓ సంస్థగా ఈసీ దాన్ని తిరస్కరించడం వల్ల ఇది కార్యరూపం దాల్చలేదు.

'సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్​ఎల్​పీతో పాటు వేరుగా ప్రమాణపత్రాన్ని తాను దాఖలు చేయడానికి ఆయన చేసిన విజ్ఞప్తిని కూడా ఈసీ తిరస్కరించింది' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎన్నికల సంఘం (ఎలక్షన్ ​కమిషనర్ల సర్వీసు నింబంధనలు, విధివిధానాలు) చట్టం-1991 సెక్షన్​ 10 ప్రకారం ఈసీ కార్యకలాపాలన్నీ ఏకగ్రీవ ఆమోదంతోనే సాగాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్​, ఇతర ఎన్నికల కమిషనర్లలో ఏదైనా విషయంపై అభిప్రాయభేదాలు తలెత్తితే 'మెజారిటీ' ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో ప్రస్తుతం సుశీల్​ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​గాను, రాజీవ్​ కుమార్​ ఎన్నికల కమిషనర్​గాను ఉన్నారు. మరో ఎన్నికల కమిషనర్​ పదవి ఖాళీగా ఉంది. 'ప్రస్తుత పరిస్థితుల్లో ఈసీ దాఖలు చేసిన ప్రమాణ పత్రం, ఎస్​ఎల్​పీలకు సంబంధించి ఈసీలో ఒక్కరే ఆమోదిస్తే దాన్ని మొత్తం అభిప్రాయంగా పరిగణించవచ్చా? లేదా? అన్న విషయమై స్పష్టత లేదు' అని న్యాయ నిపుణుడు సుమీత్​ వర్మ తెలిపారు.

ఇదీ చూడండి: 'వైద్యం అందించకుండా తప్పించుకోవడం తగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.