ETV Bharat / bharat

UP news Election: ఆపరేషన్​ యూపీ.. 'పాంచ'జన్యం పూరించిన భాజపా

author img

By

Published : Sep 9, 2021, 7:11 AM IST

త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు(Assembly Election 2022) భాజపా రంగంలోకి సమాయత్తమవుతోంది. వివిధ రాష్ట్రాలకు ఎన్నికల బాధ్యులను ప్రకటించింది. ఉత్తర్​ప్రదేశ్​ బాధ్యతలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ చూసుకోనున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​కు గోవా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఆయనకు కేంద్ర మంత్రులు జీ. కిషన్ రెడ్డి, దర్శన జర్దోష్ సహకరించనున్నారు.

bjp
bjp

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల కోసం (Assembly Election 2022) భారతీయ జనతా పార్టీ (భాజపా) అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు ఎన్నికల బాధ్యులను, సహ బాధ్యులను బుధవారం ప్రకటించింది.

  • కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌
  • పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి ఉత్తరాఖండ్‌
  • జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు పంజాబ్‌
  • పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు మణిపుర్‌
  • మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు గోవా బాధ్యతలు అప్పగించింది.

భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం (UP news Election) కోసం కేంద్ర మంత్రులు అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, శోభ కరంద్లాజే, అన్నపూర్ణాదేవి యాదవ్‌లతో పాటు ఎంపీ సరోజ్‌ పాండే, వివేక్‌ ఠాకుర్‌, కెప్టెన్‌ అభిమన్యులను సహ బాధ్యులుగా రంగంలోకి దించింది. వీరితోపాటు పార్టీ ఎంపీ సంజయ్‌ భాటియా, బిహార్‌ శాసనసభ్యుడు సంజీవ్‌ చౌరాసియా, భాజపా జాతీయ కార్యదర్శులు వై.సత్యకుమార్‌, అరవింద్‌ మేనన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ నాయకుడు సునీల్‌ ఓఝా, పార్టీ సహ కోశాధికారి సుధీర్‌గుప్తాలకు వరుసగా పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌, బ్రజ్‌, అవధ్‌, గోరఖ్‌పుర్‌, కాశీ, కాన్పుర్‌ ప్రాంతాల బాధ్యతలు అప్పగించింది.

  • ఉత్తరాఖండ్‌ ఎన్నికల వ్యవహారాలను బంగాల్​ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ, పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌.పి.సింగ్‌లు సహ బాధ్యుల హోదాలో పర్యవేక్షిస్తారు.
  • కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌, అసోం రాష్ట్ర మంత్రి అశోక్‌ సింఘాల్‌లు మణిపుర్‌ ఎన్నికలకు సంబంధించి సహ బాధ్యులుగా ఉంటారు.
  • పంజాబ్‌ ఎన్నికలకు సంబంధించి కేంద్ర మంత్రులు హర్దీప్‌సింగ్‌ పురీ, మీనాక్షీ లేఖిలు ఎంపీ వినోద్‌ చావ్డాతో కలిసి సహ బాధ్యులుగా వ్యవహరిస్తారని భాజపా వెల్లడించింది.
  • గోవాలో ఫడణవీస్‌కు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, దర్శన జర్దోస్‌లు సహకరిస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.