ETV Bharat / snippets

గుండెపోటుతో కుప్పకూలిన మహిళ - సీపీఆర్​ చేసి బతికించిన కానిస్టేబుల్

author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 9:02 PM IST

Constable saves woman by CPR
Constable saves woman by CPR (ETV Bharat)

Constable Saves woman By CPR in Sircilla : గుండెపోటుతో కుప్పకూలిన మహిళకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడి తన మంచి మనసును చాటుకున్నారు ఓ కానిస్టేబుల్​. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో జరిగింది. తండ్రి మరణవార్త విని సిరిసిల్ల పట్టణానికి చిలగాని అనూహ్య అనే మహిళ వెళ్లింది. దీంతో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అక్కడ ఏం జరిగిందో ఇంట్లో వాళ్లు గమనించేలోపే అక్కడే ఉన్న కానిస్టేబుల్​ శ్రీనివాస్​ స్పందించారు. వెంటనే తనకు సీపీఆర్​ చేసి, సమీప ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్​ చాకచక్యంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మంచిగానే ఉంది. మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్​ను పలువురు అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.