ETV Bharat / bharat

మైనర్​పై గ్యాంగ్​ రేప్​- నిందితుల అరెస్ట్

author img

By

Published : Jan 23, 2021, 11:26 AM IST

మైనర్​ను కిడ్నాప్​ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇందోర్​లో వెలుగు చూసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులతోపాటు.. మరో ఇద్దరు డ్రగ్స్​ సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు.
gang raping minor
మైనర్​లపై గ్యాంగ్​ రేప్​- నిందుతుల అరెస్ట్

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో దారుణం వెలుగు చూసింది. మైనర్​ను అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఇందోర్​ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారితో పాటు ఓ మహిళ సహా మరో ఇద్దరు మాదక ద్రవ్యాల సరఫరాదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా కొంతమంది బాలురు, బాలికలను పునరావాస కేంద్రానికి పంపినట్లు ఇందోర్​ అదనపు ఎస్పీ రాజేశ్​ రఘువంశీ తెలిపారు. వారిలో ఓ అమ్మాయి.. గతేడాది నవంబర్​ నుంచి తనపై ఇద్దరు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పిందని తెలిపారు. నిందితులు అమన్​ వర్మ, గజినీ అలియాస్​ ఆకాశ్​లపై లసూదియా పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

నిందితులకు డ్రగ్స్​ సరఫరా చేసిన భూరా అనే ఓ వ్యక్తితో పాటు మరో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12 గ్రాముల బ్రౌన్​ షుగర్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:12 ఏళ్ల బాలికపై బాలుడు అత్యాచార యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.