ETV Bharat / bharat

ప్రపంచానికి బొమ్మల హబ్​గా భారత్​: మోదీ

author img

By

Published : Aug 30, 2020, 11:52 AM IST

Updated : Aug 30, 2020, 12:50 PM IST

వోకల్ ఫర్‌ లోకల్‌లో భాగంగా దేశీయంగా బొమ్మలు తయారీ చేసేందుకు ముందుకు రావాలని స్టార్టప్‌ కంపెనీలు, యువతను కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాలకు బొమ్మల ప్రధాన కేంద్రంగా మారేందుకు భారత్​కు సత్తా ఉందన్నారు. బొమ్మల పరిశ్రమ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.7 లక్షల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందన్నారు.

modi
ప్రపంచానికి బొమ్మల హబ్​గా భారత్​: మోదీ

ప్రపంచం మొత్తానికి బొమ్మలకు ప్రధాన కేంద్రంగా నిలిచేందుకు భారత్​కు శక్తిసామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వోకల్​ ఫర్​ లోక్​లో భాగంగా దేశీయంగా బొమ్మల తయారీ చేసేందుకు ముందుకు రావాలని స్టార్టప్​ కంపెనీలు, యువతను కోరారు. బొమ్మల పరిశ్రమ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు మోదీ. ఈ రంగంలో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని.. మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పలు కీలక విషయాలపై మాట్లాడారు మోదీ.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన ఆన్‌లైన్ గేమింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయాలని దేశ యువతకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2022లో భారత్​ 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే క్రమంలో స్వతంత్ర సమరయోధుల గురించి పిల్లలకు తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. భావిభారత పౌరులు వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనది. మన వేదాల్లో రైతులను ప్రశంసించే శ్లోకాలుఉన్నాయి. కరోనా వేళ కూడ మన రైతులు కష్టపడిసాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్​లో గతేడాది కంటే ఎక్కువ సాగు చేశారు. ప్రతి పండుగనూ పర్యావరణహితంగా చేసుకోవాలి. ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకుని పండుగలు చేసుకుంటున్నారు. ఓనం పండుగ ఉత్సాహం ఇవాళ ప్రపంచం నలుమూలలకూ చేరింది. అంతర్జాతీయ ఉత్సవంగా మారుతోంది.

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇదీ చూడండి: అక్రమ ఆయుధ సరఫరా ముఠా గుట్టు రట్టు

Last Updated :Aug 30, 2020, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.