ETV Bharat / bharat

ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ రాజ్యాంగబద్ధమే: సుప్రీం

author img

By

Published : Feb 10, 2020, 11:05 AM IST

Updated : Feb 29, 2020, 8:27 PM IST

supreme-court
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ రాజ్యాంగబద్ధమే: సుప్రీం

11:00 February 10

ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ రాజ్యాంగబద్ధమే: సుప్రీం

ఎస్టీ, ఎస్టీ చట్ట సవరణ-2018 రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చట్టం ప్రకారం కేసు నమోదు కాని పక్షంలో మాత్రమే కోర్టు ముందస్తు బెయిల్​ ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.

అట్రాసిటీ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని.. బాధితులకు న్యాయం చేయాలని విన్నవిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నూతన చట్టం ప్రకారం ఎఫ్​ఐఆర్​ నమోదు చేయకముందు ఎలాంటి ప్రాథమిక విచారణ అవసరం లేదని.. సీనియర్​ అధికారుల అనుమతితో పనిలేదని పేర్కొంది. 

ప్రతి ఒక్కరు ఎదుటి వారిని సమానంగా చూడాలని.. సోదరభావంతో ఉండాలని ఈ సందర్భంగా సూచించింది ధర్మాసనం. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు కాని పక్షంలో ఎఫ్​ఐఆర్​ను కోర్టు కొట్టి వేయగలదని.. ముందస్తు బెయిల్ అనేది పార్లమెంట్​ ఉద్దేశాన్ని నీరుగారుస్తుందని పేర్కొంది ధర్మాసనం.
 

ఇదీ చూడండి: దిల్లీ ఓటింగ్​ శాతం ప్రకటనలో ఎందుకింత జాప్యం?

Last Updated : Feb 29, 2020, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.