ETV Bharat / bharat

40 లక్షలకు చేరువలో కరోనా రికవరీలు

author img

By

Published : Sep 16, 2020, 7:23 PM IST

Updated : Sep 16, 2020, 9:06 PM IST

దేశంలో కరోనా రికవరీ రేటు 78.53 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 39.5 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలో తాజాగా 23,365 మంది వైరస్​ బారినపడ్డారు. ఆ రాష్ట్రంలో మొత్తం బాధితులు సంఖ్య 11,21,221కి చేరింది.

Record 82,961 recoveries in a day, a quarter from Maha alone; recovery rate 78.53%
దేశంలో 40 లక్షలకు చేరువలో కరోనా రికవరీలు

దేశంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య (రికవరీ రేటు) క్రమంగా పెరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం రికార్డు స్థాయిలో 82,961 మంది రికవర్ అయ్యారు. దీంతో 39.5 లక్షల మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 78.53 శాతంగా ఉంది.

రాష్ట్రాల వారీగా కేసులు...

  • మహారాష్ట్రలో తాజాగా 23,365 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం బాధితులు సంఖ్య 11,21,221కి చేరింది. కొవిడ్​ ధాటికి మరో 474మంది బలవ్వగా మృతుల సంఖ్య 30,883కి పెరిగింది.
  • పశ్చిమ్​బంగాలో 3,237 కొత్త కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 2,12,383కు చేరింది. వైరస్​ కారణంగా మరో 61 మంది మరణించగా.. ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 4,123కు పెరిగింది.
  • పంజాబ్​లో తాజాగా 2,717 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 87,184కు ఎగబాకింది. మహమ్మారితో మరో 78 మంది మృతిచెందగా.. మరణాల సంఖ్య 2,592కు చేరింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 6,337 మందికి పాజిటివ్​గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3.30 లక్షలకు చేరింది. మరో 86 మంది మరణించగా... మొత్తం 4,690 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో తాజాగా 4,473 కేసులను గుర్తించారు. దీంతో మొత్తం 2.30 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. మరో 33 మంది మృతి చెందగా...ఇప్పటివరకు 4,839 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 30,914 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఒడిశాలో తాజాగా రికార్డు స్థాయిలో 4,270 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 656కు చేరింది. మొత్తం బాధితుల సంఖ్య 1.62 లక్షలు దాటింది.
  • కేరళలో కొత్తగా 3,830 కేసులు వెలుగు చూశాయి. మరో 14 మంది మృతి చెందగా... 2,263 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 84,608 మంది కోలుకున్నారు.
  • ఝార్ఖండ్​లో తాజాగా 1,702 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో 64,439 మంది వైరస్​ బారిన పడ్డారు. మొత్తం 571 మంది మృతి చెందారు.
  • జమ్ముకశ్మీర్​లో మరో 1,590 కేసులు బయటపడ్డాయి. వీటిలో 832 జమ్ములో, 758 కశ్మీర్​లో గుర్తించారు.
  • త్రిపురలో తాజాగా 454 కేసులు బయటపడగా... మరో 10 మంది మృతి చెందారు.
Last Updated : Sep 16, 2020, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.