ETV Bharat / bharat

మరోసారి పాక్​ దుర్నీతి.. సరిహద్దు గ్రామాలపై కాల్పులు

author img

By

Published : Feb 15, 2020, 1:31 PM IST

Updated : Mar 1, 2020, 10:07 AM IST

Pak violates ceasefire in J&K's Kathua firing in border villages
మరోసారి పాక్​ దుర్నీతి.. సరిహద్దు గ్రామాలపై కాల్పులు

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​ కథువాలో సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. తెల్లవారుజామున రెండున్నర గంటలపాటు కొనసాగిన ఫిరంగుల దాడికి దీటుగా బదులిచ్చింది భారత సైన్యం.

పాక్​ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​ కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలపై పాక్​ సైన్యం కాల్పులకు తెగబడినట్లు అధికారులు వెల్లడించారు.

పాక్​ ఆకస్మిక దాడులకు భారత సరిహద్దు రక్షణ దళాలు దీటుగా బదులిచ్చాయి. హీరానగర్​, చక్ర గ్రామంలో తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన కాల్పులు సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగాయి. పాకిస్థాన్​ రేంజర్లు డజన్ల కొద్ది ఫిరంగులతో దాడి చేశారని తెలిపారు అధికారులు.

ఈ ఘటనలో భారతీయ జవాన్లు, గ్రామస్థులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని స్పష్టం చేశారు.

శుక్రవారం పూంచ్​ జిల్లా, షాపూర్ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో.. ఓ గ్రామస్థుడు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగి ఒక్క రోజు కూడా గడవకముందే.. పాక్​ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది.

ఇదీ చదవండి: స్టార్​ హీరో​ కోసం 600కి.మీ సైకిల్ తొక్కిన అభిమాని

Last Updated :Mar 1, 2020, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.