ETV Bharat / bharat

దేశంలో మరో 14 వేల కరోనా కేసులు.. 155 మరణాలు

author img

By

Published : Jan 24, 2021, 9:50 AM IST

Updated : Jan 24, 2021, 12:09 PM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 14,849 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ బారిన పడి మరో 155 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటీ 6 లక్షల 50 వేలు దాటింది.

india new corona cases
దేశంలో మరో 14,849 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 14,849 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. మరో 155 మంది ప్రాణాలు కోల్పోయారు. 15,948 మంది వైరస్​ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 1,06,54,533
  • క్రియాశీల కేసులు: 1,84,408
  • కోలుకున్నవారు: 1,03,16,786
  • మరణాలు:1,53,339

దేశంలో ఇప్పటి వరకు 15,82,201 మందికి కొవిడ్​ టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ఆరు రోజుల్లోనే 10 లక్షల మందికి టీకా వేసినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:దేశంలో 150కి చేరిన యూకే వైరస్​ బాధితులు

Last Updated : Jan 24, 2021, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.