ETV Bharat / bharat

పగ్గాలు: అనుభవానికా.. ఉరకలేసే యువతరానికా?

author img

By

Published : Jul 9, 2019, 5:23 AM IST

Updated : Jul 9, 2019, 7:42 AM IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్​గాంధీ వైదొలిగిన నేపథ్యంలో... పగ్గాలను యువనేతకే అప్పగించాలని పార్టీలో పలువురు కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు . ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో యువనేతలు సచిన్ పైలట్​, జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవరా ఉన్నారు. వీరితో పాటు సీనియర్లు సుశీల్​కుమార్ శిందే, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్​ వోరా, అశోక్ గహ్లోత్​లూ రేసులో ఉన్నారు.

పగ్గాలు: అనుభవానికా.. ఉరకలేసే యువతరానికా?

పగ్గాలు: అనుభవానికా.. ఉరకలేసే యువతరానికా?

133 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. నెహ్రూ-గాంధీల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్​ గాంధీ... సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ పగ్గాలను అనుభవజ్ఞులైన పాతతరం నాయకులకు అప్పగించాలా? లేదా యువనేతలకు అప్పగించాలా? అనే మీమాంసలో కాంగ్రెస్ ఉంది.

యువనేత...కావాలి

ఈ నేపథ్యంలో రాహుల్​గాంధీ వారసుడిగా... ఓ యువనేతను ఎన్నుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ సూచించారు. ప్రస్తుతానికి ఎవరి పేర్లూ బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ... కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో రాజస్థాన్​ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్​, కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ముందు వరుసలో ఉన్నారు.

కాంగ్రెస్​ 'పైలట్'​ సచిన్​..?

రాజస్థాన్ ప్రదేశ్​ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న 41 ఏళ్ల సచిన్ పైలట్... ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను విజయతీరాలను చేర్చారు. ఆయనకు పార్టీలో క్షేత్రస్థాయి అనుభవమూ ఉంది.

సింధియాకే పగ్గాలా..?

మధ్యప్రదేశ్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న 48 ఏళ్ల జ్యోతిరాదిత్య సింధియా ఈ లోక్​సభ ఎన్నికల్లో స్వయంగా ఓటమి పాలైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో డైనమిక్ లీడర్​గా గుర్తింపు ఉంది.

రేసులో దేవరా..?

యువనేతల్లో పైలట్​, సింధియా ఇతరులకన్నా ముందున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మాజీ కేంద్రమంత్రి మిలింద్ దేవరా కూడా రేసులో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముంబయి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన 42 ఏళ్ల దేవరా, కాంగ్రెస్ పార్టీని ఓ కొలిక్కితీసుకురావడానికి జాతీయస్థాయిలో తన వంతు పాత్ర పోషించడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

అధ్యక్ష పదవి రేసులో... అతిరథులు

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో పార్టీ సీనియర్ నాయకులు సుశీల్​ కుమార్​ శిందే, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్​ వోరా, అశోక్​ గెహ్లోత్ ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు.

రాజీనామాల పర్వం..

రాహుల్​గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో...పార్టీ యువనేతలూ అదేబాటపట్టారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి పదవిని సింధియా వదులుకున్నారు. ముంబయి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మిలింద్ దేవరా, యువజన కాంగ్రెస్ అధ్యక్షపదవికి కేశవ్​ చంద్​ యాదవ్​ రాజీనామాలు చేశారు. లోక్​సభ ఎన్నికల పరాజయానికి జవాబుదారీతనం కోసమే ఇలా చేశామని వారు వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్​కు గడ్డుకాలం

సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్​ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సోనియాగాంధీ (రాయ్​బరేలీ) ఒక్కరే విజయం సాధించారు. ముంబయిలో పోటీచేసిన ఆరుస్థానాల్లో ఐదింటిని కాంగ్రెస్ కోల్పోయింది.

ఆలస్యం వద్దు..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్​ కమిటీ సమావేశమై అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత కరణ్​సింగ్ కోరారు.

యువకులను అధికార స్థానాల్లో నిలపడానికి... ఓ తాత్కాలిక అధ్యక్షుడితో పాటు, నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు లేదా ఉపాధ్యక్షులను.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ జోన్లకు ఒక్కొక్కరు చొప్పున నియమించాలనీ కరణ్​సింగ్​ సూచించారు.

యువనాయకుడు కావాలి..

కొంతమంది యువ కాంగ్రెస్ నేతలు గతవారం రాహుల్​గాంధీని కలుసుకున్నారు. యువనాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని సూచించారు. దేశంలో మెజారిటీగా ఉన్న యువతను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలంటే అనుభవజ్ఞులైన పాతతరం నాయకులు కంటే యువనేతలు అత్యవసరం అన్న వాదనా వినిపిస్తోంది.

"కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టబోయే వ్యక్తి దేశ ప్రజలందరూ గుర్తించగలిగే చరిష్మా ఉన్న నాయకుడై ఉండాలి. దీర్ఘకాలం అధ్యక్షుడిగా కొనసాగగలడనే భరోసానూ ప్రజలకు కలిగించాలి." - ఓ కాంగ్రెస్ నేత

ద్వితీయ శ్రేణి నాయకత్వం..

"రాహుల్​గాంధీ.... యువ నాయకులతో బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని నిర్మించడానికి ప్రోత్సాహం అందించారు. ఆయన ఆలోచనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పార్టీలోని అన్ని స్థాయిల్లోనూ యువనేతలను ప్రోత్సహించాలి."

- రాజేష్​ లిలోథియా, దిల్లీ ప్రదేశ్​ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు

ఈ పరిస్థితుల్లో పార్టీ పగ్గాలను యువనేతకు అప్పగించాలని పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సూచించారు. 35 ఏళ్ల లోపు వయస్సున్న యువత దేశంలో 65 శాతం ఉన్నారు. భారతదేశ ఈ సామాజిక వాస్తవికతను ప్రతిబింబించేలా పార్టీ నాయకత్వంలో మార్పు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే సీడబ్ల్యూసీ సమావేశం షెడ్యూల్​ ఇంకా ఖరారు కాకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి: 'చమురు ధరలు పెంచితే సామాన్యుడి పరిస్థితి ఏంటి?'

Manchester (UK), Jul 08 (ANI): Virat Kohli, Indian cricket team captain while addressing the press conference praised Rohit Sharma for his record breaking spree in 2019 World Cup. He said, "Rohit said he is only trying to do the best for the team. I could never imagine the number of 100s I've. I hope Rohit gets 2 more so that we win the matches. According to me, he is the top ODI player in the world." Rohit Sharma became the first batsman to score five centuries in a World Cup.
Last Updated : Jul 9, 2019, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.