ETV Bharat / bharat

'కేంద్రం తీరు వల్లే  రైతులు బంద్​ చేపట్టారు'

author img

By

Published : Sep 27, 2021, 11:00 AM IST

Updated : Sep 27, 2021, 11:05 AM IST

bharat bandh news
'భారత్​ బంద్'​కు రాహుల్​ మద్దతు

భారత్​ బంద్​కు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మద్దతు తెలిపారు. రైతు సంఘాలు ప్రకటించిన భారత్​ బంద్​కు (Bharat bandh today) మద్దతుగా నిలవాలని కాంగ్రెస్​.. పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

సాగు చట్టాలకు నిరసనగా రైతు నేతలు చేపట్టిన భారత్​ బంద్​కు (Bharat bandh today) కాంగ్రెస్​ ​ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. రైతులు శాంతియుతంగా చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే వారు ఈ విధంగా బంద్​ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం (Rahul Gandhi Twitter) ట్వీట్​ చేశారు.

రైతు సంఘాలు ప్రకటించిన భారత్​ బంద్​కు (Bharat bandh today) మద్దతుగా నిలవాలని కాంగ్రెస్​.. పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్​ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు భారత్​ బంద్​కు మద్దతు తెలిపాయి.

దిల్లీ సరిహద్దుల్లోని గాజీపుర్‌ సహా దేశంలో వివిధ ప్రాంతాల్లో అన్నదాతలు చేపట్టిన బంద్​ శాంతియుతంగా కొనసాగుతోంది.

ఈ బంద్​ అందుకే..

భారత్​ బంద్​పై భారత్​ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్ (Rakesh tikait news)​ స్పందించారు..

"అంబులెన్సులు, డాక్టర్లు సహా అత్యవసర సేవలకు మేము ఎలాంటి అంతరాయం కలిగించం. కేవలం కేంద్రానికి సందేశం ఇవ్వడం కోసమే ఈ బంద్​ చేపట్టాం. దుకాణాదారులు సాయంత్రం 4 వరకు షాపులు మూసి ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చర్చలకు మరోసారి సిద్ధమని కేంద్రం చెప్తున్నా అది కేవలం టీవీలకే పరిమితమైంది. మమ్మల్ని నేరుగా ఎవరూ సంప్రదించలేదు."

-రాకేశ్​ టికాయిత్​, రైతు నేత

ఇప్పటివరకు జరిగిన చర్చల్లో సాగు చట్టాల ప్రస్తావన తీసుకురాలేదన్నారు రాకేశ్​ టికాయిత్​. అవి తప్ప ఇతర ఏ సమస్యల గురించి అయినా చర్చించాలని కేంద్రం పేర్కొందని.. అలాంటప్పుడు చర్చల వల్ల ఫలితం లేదని భావిస్తున్నానని తెలిపారు.

ఇదీ చూడండి : డబుల్ డిగ్రీ చేసి.. వీధుల్లో 'చెత్త ఆటో' నడుపుతూ...

Last Updated :Sep 27, 2021, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.