ETV Bharat / bharat

ఇనుప గొలుసులకు మొక్కితే కోరికలు తీరడం తథ్యం! అదే ఆ శివాలయం స్పెషల్!!

author img

By

Published : Feb 18, 2023, 5:44 PM IST

Updated : Feb 18, 2023, 8:26 PM IST

మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఈ మహా పర్వదినాన ప్రజలు నిద్రాహారాలు మాని.. కుటుంబ సమేతంగా శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడ్ని దర్శించుకుంటారు. శివలింగాన్ని తాకి తమ కోరికలు చెప్పకుంటారు. కొందరు పాలభిషేకం చేస్తారు. ఇంకొందరు శివుడి ముందు సాష్టాంగనమస్కారం చేసి కోరికలు నేరవేర్చమని వేడుకుంటారు. కానీ పంజాబ్​లోని ఓ శివాలయంలో ఓ వింత ఆచారం ఉంది. అదేంటంటే.. దేవాలయానికి విచ్చేసిన శివ భక్తులు గుడి తలుపులకు కట్టిన గొలుసులతో తమ కోరికలు చెప్పుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారో.. దాని ప్రత్యేకతేంటో తెలుసుకుందామా మరి..!

ancient shiva temple in ludhiana
ancient shiva temple in ludhiana

ఇనుప గొలుసులకు మొక్కితే కోరికలు తీరడం తథ్యం! అదే ఆ శివాలయం స్పెషల్!!

హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. శివపార్వతులకు పెళ్లైన ఈరోజున భక్తులంతా ఉపవాసాలు ఉంటూ.. జాగారం చేస్తూ ఆ నీలకంఠుడికి పూజలు చేస్తారు. ఆ కైలాసుడు మహానందంతో తాండవం చేసిన ఈ రోజున.. శివలింగాన్ని తాకి మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందని ప్రజలు నమ్ముతుంటారు. అయితే పంజాబ్​లోని ఓ శివాలయంలో మాత్రం భక్తులు దైవ దర్శనం అనంతరం.. బయటకు వస్తూ గుడి ద్వారాలకు కట్టిన గొలుసులను తాకి మనసులోని మాటను విన్నవించుకుంటారు.

పంజాబ్​లోని లుథియానా శివార్లలో ఉండే ఈ ఆలయానికి.. 500 ఏళ్లగా పైగా చరిత్ర ఉంది. ఇక్కడకు వచ్చి గుడి ద్వారానికి కట్టి ఉంచిన గొలుసులను నుదిటిపై పెట్టుకుని భక్తులు కోరికలు కోరుకుంటారు. ఇలా చేస్తే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. దీంతో ఈ ఆలయానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచే కాకుండా.. హరియాణా, హిమాచల్ ప్రదేశ్​, రాజస్థాన్‌, ఉత్తర్​ప్రదేశ్​ నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అలానే ఈ మహాశివరాత్రి నేపథ్యంలో వేల సంఖ్యలో భక్తులు దైవదర్శనానికి వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా గొలుసు పట్టుకుని తమ మనసులోని మాటను ఆ త్రినేత్రుడికి చెప్పుకున్నారు.

..
500 ఏళ్ల నాటి శివాలయం
ancient shiva temple in ludhiana
500 ఏళ్ల నాటి శివాలయం
ancient shiva temple in ludhiana
ఇనుప గొలుసులను మొక్కుతున్న ప్రజలు

దాదాపు 500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో శివలింగం స్వయంగా వెలసింది. దీంతో ఆ కాలంలోని ప్రజలు.. అక్కడే ఇరుకైన వీధుల్లో ఓ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి ప్రజలు గుడికి రక్షణగా తలుపును గొలుసులతో కట్టేవారు. అక్కడ పని చేసే పూజారులు కూడా చేతులకు గొలుసులు ధరించేవారు. దీంతో ఈ గుడికి సింగాల శివాలయం అనే పేరొచ్చింది. ఇక్కడకు వచ్చిన భక్తులు శివుడికి పాలు, పూలతో అభిషేకాలు చేసి.. స్వయంభులింగాన్ని దర్శించుకుంటారు. అనంతరం గుడి నుంచి బయటకు వస్తూ దేవాలయానికి రక్షణగా కట్టిన గొలుసులను పరమ పవిత్రంగా భావించి.. కోరికలు చెప్పుకుంటారు.

ancient shiva temple in ludhiana
500 ఏళ్ల నాటి శివాలయం
ancient shiva temple in ludhiana
శివాలయంలో ఇనుప గొలుసులను మొక్కుతున్న ప్రజలు

పల్లీలతో లింగం తయారీ

mahashivratri 2023
కర్ణాటక కలబురగిలో పల్లీలతో శివలింగాన్ని తయారు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని సేడం రోడ్​లో ఉన్న బ్రహ్మకుమారి ఆశ్రమంలో 25 అడుగుల ఎత్తైన లింగాన్ని రూపొందించారు. కుంకుమ, ఇతర సుగంధ ద్రవ్యాలతో శివలింగాన్ని అలంకరించారు.
mahashivratri 2023
పల్లీల శివలింగం

బిస్కెట్ శివలింగం

biscuit shivling
ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో బిస్కెట్లతో తీర్చిదిద్దిన శివలింగం భక్తులను ఆకట్టుకుంటోంది. 1151 బిస్కెట్లతో ఈ లింగాన్ని రూపొందించారు. మధ్యప్రదేశ్ ఖజురహోలో ఉన్న ప్రఖ్యాత శివలింగాన్ని ప్రతిబింబించేలా ఈ బిస్కెట్ లింగాన్ని తయారు చేశారు. సంగం తీరంలో ఉన్న దీన్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.
Last Updated :Feb 18, 2023, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.