ETV Bharat / bharat

పదేళ్ల బాలికపై అత్యాచారం.. గొంతు నులిమి హత్య.. కన్న తండ్రే కామాంధుడై..

author img

By

Published : Mar 4, 2023, 7:59 AM IST

పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. మరోవైపు, ఇదే రాష్ట్రంలో 14ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తన తండ్రి లైంగికంగా వేధించాడని సూసైడ్ నోట్​లో పేర్కొంది.

a ten years old girl was raped and killed in Palghar maharastra
మహారాష్ట్రలో 10ఏళ్ల బాలికపై అత్యాచారం

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 4వ తరగతి చదువుతున్న 10ఏళ్ల బాలికపై ఓ దుండగుడు అత్యాచారం జరిపి, తర్వాత గొంతు నులిమి చంపేశాడు. పోలీసులు వెంటనే విచారణ జరిపి గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తలాసరి తాలూకాలోని డోంగారీలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఉదయం పాఠశాలకు వెళ్లింది. బాలిక స్కూల్ అయిపోయాక ఇంకా ఇంటికి రాకపోవడం వల్ల తల్లిదండ్రులు గ్రామంలో అంతా వెతికారు. ఎంత వెతికినా బాలిక ఆచూకీ తెలియలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు తలాసరి పోలీస్ స్టేషన్​లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్ అజయ్ వాసవే నాలుగు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ఆధారాల ద్వారా.. పోలీసు బృందాలు కొన్ని గంటల వ్యవధిలోనే సంబంధిత అమ్మాయిని గుర్తించి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇసామ్(45)ను పోలీసులు పట్టుకుని దర్యాప్తు చేయగా.. అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు పదేళ్ల పాప తాతతో కలిసి బోటులో చేపలు పట్టేవాడు. డబ్బుల విషయంలో వారి మధ్య వివాదాలు రావడం వల్ల నిందితుడు పాపను అపహరించి గుజరాత్ రాష్ట్రంలోని భిలాద్ సంజన్ రోడ్డులో అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత గొంతు నులిమి చంపేశాడు. ఈ మేరకు తలాసరి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి సెక్షన్ 302, 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

a ten years old girl was raped and killed in Palghar maharastra
మహారాష్ట్రలో 10ఏళ్ల బాలికపై అత్యాచారం

కన్న తండ్రే కామాంధుడిలా మారి!
మరోవైపు, పాల్ఘర్ జిల్లాలోనే మరో దారుణం జరిగింది. కన్న తండ్రే తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. వాసాయీ తాలుకాకు చెందిన బాలిక... మూడు రోజుల క్రితం ఉరి వేసుకొని చనిపోయిందని శుక్రవారం అధికారులు వెల్లడించారు. తాను ఉంటున్న ఇంట్లోనే బాలిక ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. తొలుత ఈ ఘటనపై ప్రమాదకరమైన మరణం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

అయితే, బాలిక మృతికి సంబంధించి సూసైడ్ నోట్ లభ్యమైందని అధికారులు తెలిపారు. సొంత తండ్రే తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని బాలిక అందులో రాసిందని చెప్పారు. ఈ విషయం తల్లికి చెప్పినా.. ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయంలో తన తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్​ నోట్​లో బాలిక రాసినట్లు వివరించారు. దీంతో ఈ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.