ETV Bharat / bharat

దేశంలో మరో 975 కరోనా కేసులు.. తగ్గిన మరణాలు

author img

By

Published : Apr 16, 2022, 8:48 AM IST

Updated : Apr 16, 2022, 9:12 AM IST

Covid Cases In India: దేశంలో కొత్తగా 975 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోగా, 796 మంది కోలుకున్నారు. మరోవైపు శుక్రవారం దేశవ్యాప్తంగా 6,89,724 టీకాలను కేంద్రం పంపిణీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 6,99,300 మందికి వైరస్​ సోకింది.

India corona
India corona

Covid Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మరో 975 మంది వైరస్​ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,40,947కు చేరింది. వైరస్​ ధాటికి నలుగురు చనిపోయారు. 796 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 11,366గా ఉన్నాయి.

  • యాక్టివ్ కేసులు: 11,366
  • మరణాలు: 5,21,747
  • మొత్తం కేసులు: 4,30,40,947
  • రికవరీలు: 4,25,07,834

Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 6,89,724 మందికి శుక్రవారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,38,31,723కు చేరింది. కొత్తగా 3,00,918 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 79,60,57,533‬ కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 6,99,300 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,270 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • దక్షిణ కొరియాలో తాజాగా 125,808 కరోనా కేసులు నమోదయ్యాయి. 264 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 88,188 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 91 మంది మృతిచెందారు.
  • ఫ్రాన్స్​​లో తాజాగా 125,394 మంది వైరస్​ సోకింది. మరో 151 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో 45,999 కరోనా కేసులు బయటపడ్డాయి. 34 మంది వైరస్​కు బలయ్యారు.
  • ఇటలీలో 61,555 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 133 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి: 'అలా జీవచ్ఛవంలా బతికే బదులు చావడం మేలు కదా!'

ప్రాణం తీసిన ఫ్రీఫైర్​.. బాలుడ్ని రాయితో కొట్టి చంపిన స్నేహితులు

Last Updated : Apr 16, 2022, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.