ETV Bharat / bharat

కేరళలో కరోనా విలయం- కొత్తగా 6,800 కేసులు

author img

By

Published : Nov 3, 2020, 8:34 PM IST

6,862 new #COVID19 cases and 26 deaths have been reported in Kerala
కేరళలో కరోనా విలయం- కొత్తగా 6,800 కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. అయితే కేరళ, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. కేరళలో కొత్తగా 6,800మంది వైరస్ బారిన పడ్డారు.

భారత్​లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన ఏడు వారాలుగా కొవిడ్ కేసుల నమోదులో క్షీణత కనిపిస్తుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రికవరీ రేటు 92శాతానికి చేరువైనట్లు వెల్లడించింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్​ బాధితులు పెరుగుతున్నారు. ముఖ్యంగా కేరళ, దిల్లీ, కర్ణాటక, రాజస్థాన్​ సహా పలు రాష్ట్రాల్లో భారీగా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి.

కేరళలో కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 6,862 కేసులు నమోదయ్యాయి. మరో 26 మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 50 వేలకు చేరువైంది.

దిల్లీలో వైరస్​ విజృంభణ

దిల్లీలో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 6,725 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 3 వేలు దాటింది. మరో 68 మంది మహమ్మారికి బలయ్యారు.

  • కర్ణాటకలో ఒక్కరోజే 2,756 మందికి వైరస్​ సోకింది. మరో 26 మంది చనిపోయారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8 లక్షల 32 వేలు దాటింది.
  • రాజస్థాన్​లో తాజాగా 1,725 మంది కరోనా బారిన పడ్డారు. 10మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 2 వేలు దాటింది.
  • గుజరాత్​లో కొత్తగా 945 కేసులు నమోదవగా.. ఆరుగురు కరోనాతో మృతి చెందారు. మొత్తం కేసులు లక్షా 75 వేల 396కు చేరాయి.
  • జమ్ముకశ్మీర్​లో కొత్తగా 478 మందికి కరోనా సోకింది.

ఇదీ చూడండి: మధ్యప్రదేశ్​ మినహా ప్రశాంతంగానే 'ఉప'పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.