ETV Bharat / bharat

మూడేళ్ల పాప లాకప్​ డెత్​పై నిరసన జ్వాల

author img

By

Published : Jan 4, 2021, 12:41 PM IST

3-yr-old girl lockup death: people ended up protest after the police assured the fair enquiry
మూడేళ్ల పాప లాకప్​డెత్​.. కర్ణాటకలో ఘటన..

మూడేళ్ల పాప లాకప్​డెత్​ అయ్యింది. వినడానికే నమ్మశక్యం కాని ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఓ కేసులో అరెస్టైన తన తల్లితో పాటే ఆ చిన్నారిని జైలుకు తరలించారు పోలీసులు. బాలిక మృతితో వందల సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు.

మూడేళ్ల చిన్నారి లాకప్​ డెత్​ అయిన ఘటన కర్ణాటకలోని కలబురిగీలో కలకలం రేపింది. దీంతో వందల సంఖ్యలో ప్రజలు పోలీస్​ స్టేషన్​ ముందు ఆందోళనకు దిగారు. బాలిక మృతిపై నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేస్తామన్న పోలీసుల హామీతో నిరసనకారులు వెనక్కితగ్గారు.

అసలేం జరిగింది?

గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన గొడవల్లో భాగంగా ఓ మహిళను జేవార్జీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటే తన మూడేళ్ల పాపనూ జైలుకు తరలించారు. చిన్నారికి అనారోగ్యంగా ఉందని గుల్బర్గా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(జీఐఎంఎస్​) కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు.

-సిమి మరియం జార్జి, కలబురిగీ ఎస్పీ.

ఎమ్మెల్యే నిరసన

విషయం తెలుసుకున్న జేవార్జీ నియోజకవర్గ కాంగ్రెస్​ ఎమ్మెల్యే డా.అజయ్​ సింగ్​ తన అనుచరులతో కలిసి ఠాణా ముందు బైఠాయించారు. 'డిసెంబర్ 30న గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. అందులో భాగంగానే ఆ మహిళను అరెస్ట్​ చేశారు. పోలీసులు కాంగ్రెస్​ వర్గీయులపై నాన్​ బెయిలబుల్​ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే భాజపా వారికి ఒక్క రోజులోనే స్టేషన్​ బెయిల్​ వచ్చింది. పాప మృతికి పోలీసులు బాధ్యత వహించాలి' అని ఎమ్మెల్యే డిమాండ్​ చేశారు.

3-yr-old girl lockup death: people ended up protest after the police assured the fair enquiry
ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే

ఇదీ చదవండి: 'రాజకీయ ఒత్తిళ్ల వల్లే గంగూలీకి గుండెపోటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.