భూహక్కు చట్టం రద్దుకు పోరాటం - న్యాయవాదులకు కేఏ పాల్ మద్దతు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 6:56 PM IST

thumbnail

KA Paul Demanded Withdraw of AP Land Rights Act: ఏపీ భూహక్కు చట్టం ఉపసంహరించుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ విశాఖలో న్యాయవాదుల చేపట్టిన రిలే నిరహార దీక్షలకు కేఏ పాల్ మద్దతు తెలిపారు. భూ కబ్జాదారులకు, కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేలా భూహక్కు చట్టం ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని కేఏ పాల్ తెలిపారు. 

ఆంధ్రుల కోసం న్యాయవాదులు చేస్తున్న పోరాటం అభినందిస్తున్నాని కేఏ పాల్ తెలిపారు. భూహక్కు చట్టం అనేది లక్షల ఎకరాల దోపిడీకి ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ అని పాల్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ వర్కర్స్, ఉద్యోగుల భద్రత కల్పించడంలో విఫలమయ్యారని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా పరిరక్షించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు, కార్యదర్శి పైలా శ్రీనివాసరావు, న్యాయవాది పలక శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.