పెంచలకోన జలపాతంలో చిక్కుకున్న అయ్యప్ప స్వాములు - చాకచక్యంగా రక్షించిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 10:08 PM IST

Updated : Nov 30, 2023, 8:52 AM IST

thumbnail

Heavy Rains in Nellore : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పెంచలకోన జలపాతం వరదలో చిక్కుకున్న 11మందిని పోలీసులు రక్షించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారీ వర్షం కారణంగా పెంచలకొన జలపాతం వద్ద కొంత సేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. బుచ్చిరెడ్డిపాలం, గొలగమూడికి చెందిన 11మంది అయ్యప్ప స్వాములు జలపాతం సందర్శనకు వెళ్లారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వరద ఉద్ధృతి పెరిగింది. వరదలో అయ్యప్ప స్వాములు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వరదలో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Rain Alert to AP Due to Low Pressure in Bay of Bengal : భారీ వర్షాల కారణంగా నెల్లూరు నగరంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని డ్రైన్​లో వెళ్లాల్సిన వర్షపు నీరు రోడ్ల మీద ప్రవహించింది. నగరంలో డ్రైనేజీలు అత్యధిక శాతం ఆక్రమణలకు గురి కావడంతో వర్షపు నీరు బయటకు పోలేక రోడ్ల మీద నిలిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, కోవూరు, కావలి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.

Last Updated : Nov 30, 2023, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.