Class War in Srikakulam YCP Leaders: బొత్స మేనల్లుడి పుట్టినరోజు వేడుకల్లో బయటపడ్డ వైసీపీ వర్గపోరు
Class War in Srikakulam YCP Leaders : అధికార పార్టీ నేతల్లో వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(Majji Srinivasa Rao) పుట్టిన రోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అతని అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం దుమారం రేపింది. బొత్స మేనల్లుడైన మజ్జి శ్రీనివాసరావు పుట్టినరోజు ఫ్లెక్సీలు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి వీలు లేదని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్... ఎంపీపీ చిరంజీవికి తెలియజేశారు. దీంతో ఎంపీపీ అన్ని గ్రామాల వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ కార్యకర్తలు హెచ్చరికలను లెక్కపెట్టకుండా మజ్జి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
YCP Workers Tore Down Flexi Vizianagaram Zilla Parishad Chairman: అయితే, వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీపీ అనుచరులు సుమారు 7 గ్రామాల్లో అర్థరాత్రి సమయంలో ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్న దుండగులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేసేందుకు ఎమ్మెల్యే, ఎంపీపీ చిరంజీవి పురమాయించారని దుండగులు వెల్లడించారు. దీంతో అధికార పార్టీలోని నాయకుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కిరణ్, ఎంపీపీ చిరంజీవిపై స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.