Capital Farmers Dharna: సీఆర్​డీఏ మొండి వైఖరిని నిరసిస్తూ.. రేపు అమరావతి రైతుల ధర్నా

By

Published : Jul 18, 2023, 9:27 PM IST

thumbnail

Capital Farmers Dharna in vijayawada : రాజధాని రైతులపై సీఆర్​డీఏ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 19న బుధవారం ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో భారీ ధర్నా నిర్వహించనున్నారు. కౌలు చెక్కులు ఇవ్వకుండా మళ్లీ భూ పత్రాల పరిశీలన చేయాలన్న సీఆర్​డీఏ నిర్ణయం మానుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దాదాపు 8 సంవత్సరాలు కౌలు ఇచ్చిన తర్వాత తాజాగా భూ పత్రాల పరిశీలన పేరుతో కాలయాపన చేయడానికే ఈ కుట్ర చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇలాంటి కాలయాపన చర్యలు మానుకొని తమకు ఇచ్చిన స్థలాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. భూసమీకరణ సమయంలోనే అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీసుకున్నారని వారు చెప్పారు.

"ఎప్పుడైతే మా రిటర్నబుల్ ఫ్లాట్​లు మాకు రిజిస్ట్రేషన్ చేస్తారో అప్పుడు పరిశీలన జరుగుతుంది. కానీ సీఆర్​డీఏ ఎందుకు అర్ధాంతరంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయాలి. ఈ నెపంతో కౌలు జమని వాయిదా వేస్తూ తీవ్ర ఇబ్బందులకు కలగజేస్తున్నారు. సీఆర్​డీఏ రైతుల పట్ల ఒక పక్షపాత వైఖరితో, మోసపూరితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది."- పువ్వాడ సుధాకర్, రాజధాని ఐకాస సభ్యుడు

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.