పోలీసుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ - CPI Ramakrishna fires on jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 7:06 PM IST

thumbnail
పోలీసుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (ETV Bharat)

CPI Ramakrishna Fires on Jagan Government : రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధను నిర్వీర్యం చేసిన ఘనత జగన్‍ ప్రభుత్వానికే దక్కుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈవీఎంలను పగలగొట్టిన పిన్నెల్లిని పట్టుకోలేని అసమర్థులు ఏపీ పోలీసులని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టించిన అపఖ్యాతి జగన్​కే దక్కుతుందన్నారు. జగన్‍ అధికారంలోకి వచ్చాక పోలీసులమన్న విషయమే వారు మర్చిపోయారన్నారు. రాష్ట్రంలో హోంమంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఎన్నికల వేళ 10వేల కోట్లు ఖర్చు పెట్టాయని రామకృష్ణ ఆరోపించారు.

ఎన్నికల్లో ఓటు వేయడానికి డబ్బులు ఇవ్వాలంటూ ప్రజలు ధర్నాలు చేయడం రాష్ట్రంలోని పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో పోలీసులు విధులను మరిచి వైఎస్సార్సీపీ సేవకులుగా మారారని విమర్శించారు. పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్‌ రోజున, అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ కూడా విధుల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యిందని రామకృష్ణ ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.