ETV Bharat / state

AP Election Commission Bans Transfer on Employees: ఉద్యోగుల బదిలీలు, ఖాళీల భర్తీపై నిషేధం.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2023, 9:47 PM IST

AP_Election_Commission_Bans_Transfer
AP_Election_Commission_Bans_Transfer

AP Election Commission Bans Transfer on Employees: రాష్ట్ర ఎన్నికల సంఘం.. అధికారులు, ఉద్యోగుల బదిలీలు, ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలు, ఖాళీల భర్తీపై నిషేధం విధించింది. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

AP Election Commission Bans Transfer on Employees: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఎన్నికల అధికారులు, ఉద్యోగుల బదిలీలు, ఖాళీల భర్తీకి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్యుల్లో.. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగుల బదిలీలు, ఖాళీల భర్తీపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, 2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలకి సంబంధించి.. ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

Prohibition on Transfers of Election Employees: రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌-సీఈవో) ముఖేష్ కుమార్‌ మీనా శుక్రవారం ఉద్యోగుల బదిలీలు, ఖాళీల భర్తీపై నిషేధం విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. 2024 జనవరి 5 తేదీ నాటికి ఫొటో, ఓటర్ల తుది జాబితా రూపకల్పన ప్రక్రియలో కీలకంగా ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలకు సంబంధించి.. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలియజేశారు. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది ఖాళీల పైనా అక్టోబర్ 10 తేదీలోగా వివరాలు ఇవ్వాలని.. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల్లో.. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియలోని అధికారులు, ఉద్యోగుల బదిలీకి, నియామకాలకు వీల్లేదని స్పష్టం చేశారు.

AP Voters List : రాష్ట్ర ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల...మహిళలే ఎక్కువ

Mukesh Kumar Meena Orders: ఉత్తర్వుల్లో ఉన్న ప్రకారం.. ''ఫొటో ఓటర్ల తుది జాబితా రూపకల్పన కోసం అన్నీ ఖాళీలను అక్టోబర్ 10లోగా భర్తీ చేయాలి. ఈ వ్యవహారంలో ఎలాంటి ఉల్లంఘన జరిగినా అది ఎన్నికల నియమావళి కిందకు వస్తుంది. ప్రస్తుతం ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో ఉన్న అధికారుల బదిలీల కారణంగా ఆ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుంది. అంతేకాకుండా, జాబితా నాణ్యత, రివిజన్ ప్రక్రియ దెబ్బతింటుంది. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులు, వీఆర్వోలు,తహసీల్దార్లు తదితర అధికారులను బదిలీ చేసేందుకు అవకాశం లేదు. ఒకవేళ బదిలీ అత్యవసరమైతే ముందస్తుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకురావాలి. దీనికి విరుద్ధంగా జరిగితే సదరు ఉన్నతాధికారులపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం'' అని ముఖేష్ కుమార్‌ మీనా తెలియజేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీకి చంద్రబాబు లేఖలు !

Final Voters List Relesed on 5th January 2024: మరోవైపు గత ఎన్నికల జాబితాల రూపకల్పనలో తలెత్తిన ఆరోపణలు, కోర్ట్ కేసులు, క్రమశిక్షణా చర్యలకు గురైన అధికారులు, ఉద్యోగుల పోస్టింగ్ అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తేవాలని..ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా తెలిపారు. 2023 అక్టోబర్ 27 తేదీ నుంచి 2024 జనవరి 5 తేదీ ముసాయిదా జాబితా ప్రకటించేంత వరకూ బదిలీలు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో వివరించారు. 2023 అక్టోబర్ 27 నాటికి ముసాయిదా జాబితా, అలాగే 2024 జనవరి 5 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

AP High Court on Votes Missing Petition: ఏపీలో ఓట్లు తొలగింపు వ్యవహారంపై స్పందించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులకు నోటీసులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.