ETV Bharat / state

Atchannaidu Comments on YSRCP: వైసీపీ పాలనలో దళితులపై అనేక దాడులు: అచ్చెన్నాయుడు

author img

By

Published : Jun 13, 2023, 5:53 PM IST

Atchannaidu comments
Atchannaidu comments

Atchannaidu comments on CM Jagan: మాదిగలు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి దేశంలో ఎక్కడా జరగలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారని గుర్తు చేశారు. భాజపా నేతలు ఆరోపణలు చేసి మూడు రోజులైనా జగన్, వైసీపీ నేతలు.. వాటిని ఖండించలేదంటే అవి నిజమేనంటూ మండిపడ్డారు

TDP Comments on YSRCP: వైసీపీ సర్కార్ దళితులకు తీవ్ర అన్యాయం చేసిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చెన్నాయుడు హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి మాదిగ సామాజిక వర్గ నేతలు భారీగా తరలివచ్చారు. మాదిగలకు అన్ని విధాలుగా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం అని అచ్చెన్న స్పష్టం చేశారు.

బీజేపీ జాతీయ నేతలు ఆరోపణలు: జగన్ లాంటి అవినీతిపరుడు ఈ ప్రపంచంలో లేరని, ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదని తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డానే విమర్శించారని గుర్తు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశాఖపట్నంలో ఈ నాలుగు సంవత్సరాలలో జగన్ దోపిడీ చేసిన విషయాలన్నీ బహిర్గతం చేశారన్నారు. బీజేపీ జాతీయ నేతలు ఆరోపణలు చేసి మూడు రోజులైతే జగన్ ఇంతవరకు నోరు మెదపలేదని ఎద్దేవా చేసారు. జగన్ రెడ్డికి 510 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్​లో పొందుపరిచారు. దేశంలోనే ధనవంతుడైన సీఎంగా రికార్డ్ సృష్టించిన జగన్మోహన్ రెడ్డి పేదవాడా అని ప్రశ్నించారు. ఏడు బంగళాలు కట్టుకున్న జగన్ పేదవాడా అని అచ్చెన్నాయుడు నిలదీశారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల కోట్లు అధిక ఆదాయం ఉన్న రాష్ట్రాని.. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పుల పాలు చేశాడని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం రాష్ట్రానికి వచ్చే రూ. 40వేల కోట్లు కోల్పొయిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలవడమే కాదు అంతా కలిసి జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసే పరిస్థితి వస్తుందని అచ్చెన్న జోస్యం చెప్పారు. అందుకోసమే అన్ని కులాలను ఏకం చేస్తునట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే... సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా వెనుకబడిన కులాలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.

ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు

'గతంలో తెలుగుదేశం ఇచ్చిన 27 పథకాలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించాడు. చంద్రబాబు అధికారంలో ఉండగా కార్పోరేషన్లు ఇవ్వలేదని ఆరోపించిన జగన్.. ఈ నాలుగు సంవత్సరాలలో దళితుల కోసం ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టాడా? చంద్రబాబు డిక్లరేషన్ చూసిన తరువాత వైసీపీ నేతలకు ఎం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.' అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు

ప్రతి సభలో సీఎం జగన్ తాను పేదవాడిని అని చెప్పుకుంటున్నారని, దేశంలో 29 మంది మఖ్యమంత్రులు ఉంటే... సీఎం జగన్ ఒక్కడికే 510 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్​లో వెల్లడించారని అచ్చెన్న విమర్శించారు. దేశంలో 28 మంది ముఖ్యమంత్రుల మెుత్తం ఆస్తులు 508 కోట్లే అని వెల్లడించారు. రూ.2500కు లీటర్ ఉండే నీరుతో జగన్ స్నానం చేస్తారని అచ్చెన్న ఆరోపించారు. పేద వాడిని అని చెప్పుకునే జగన్​కు ఏడు బంగ్లాలు ఉన్నాయని... బెంగుళుర్​ లో ఓ బంగ్లా, కడపలో ఓ బంగ్లా, పులివెందులలో ఓ బంగ్లా, హైదరాబాద్​లో ఓ బంగ్లా.. తాడేపల్లిలో ఓ బంగ్లా... ఇవి కాకుండా ఇప్పుడు మళ్లీ విశాఖలో కొంప కడుతున్నాడని అచ్చెన్న విమర్శించాడు. వైసీపీ పరిపాలనకు రోజులు దగ్గర పడ్డాయని, అచ్చెన్న ఎద్దేవా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.