ETV Bharat / state

BJP leaders fire on Jagan విశాఖసభలో సీఎం జగన్​పై తీవ్రస్థాయిలో మండిపడిన బీజేపీ నేతలు

author img

By

Published : Jun 12, 2023, 6:39 AM IST

PM Modi government: మోదీ 9 ఏళ్ల పాలనలో విజయాలపై బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు విశాఖలో నిర్వహించిన సభలో కేంద్ర హోమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. రాష్ట్ర నేతలు వైసీపీ పరిపాలనపై విరుచుకుపడ్డారు. మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ది చెందుతుందని.. మోదీ ప్రభుత్వం ఇచ్చే పథకాలకు.. జగన్ పేరును వాడుకుంటున్నాడని మండిపడ్డారు.

Etv Bharat
Etv Bharat

9 years of PM Modi government: మోదీ 9 ఏళ్ల పాలన విజయాలపై దేశవ్యాప్తంగా బీజేపీ సభలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఏర్పటు చేసిన భహిరంగ సభలో కేంద్ర హోమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే బీజేపీ విజయాలు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పంచే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నది దోపిడీ, అవినీతి పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం, ఇసుక, భూముల దోపిడీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

తాత, తండ్రుల పేర్లు చెప్పి బీజేపీ అధికారం చేయడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ విమర్శించాడు. నిన్న జేపీ నడ్డా సభలో ఈ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై మాట్లాడితే నడ్డాను పేర్ని నాని విమర్శించడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రానికి రాజధాని లేదనే నడ్డా అన్నారని.. అలా అంటే ఏమైనా తప్పా.. అని సత్యకుమార్ ప్రశ్నించారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చినందుకే ఇంత గర్వమా? అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. పాలనా రాజధాని పేరుతో విశాఖలో విధ్వంసాలు చేస్తున్నారని సత్యకుమార్ ఆరోపించారు. విశాఖలో ఎక్కడ చూసినా కబ్జాలు, ఆక్రమణలే.. కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలా.. వద్దా.. జగన్ చెప్పాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. పేర్ని నాని స్థాయి మరిచి మాట్లాడుతున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. నడ్డా వచ్చి 4 ప్రశ్నలు వేస్తేనే ఎందుకు ఉలికిపడుతున్నారాని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పంపిచే రేషన్‌ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పథకాలు కేంద్రానివి.. పేరు మాత్రం రాష్ట్రానిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్‌కు రాష్ట్ర వాటా ఇవ్వడం లేదని సత్యకుమార్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధుల్లోనూ కమిషన్లు కొట్టేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని మీరు నడ్డాను విమర్శిస్తారా? అంటూ మండిపడ్డారు

భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే.. అది కేవలం మోదీ పరిపాలన వల్లే అని పురందేశ్వరి వెల్లడించారు. దేశం ఫోన్లను దిగుమతి చేసే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని పురందేశ్వరి వెల్లడించారు. బీజేపీ మిగతా పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని పురందేశ్వరి అన్నారు. నిబద్ధత, పారదర్శకమైన పార్టీ బీజేపీ మాత్రమే అని పురందేశ్వరి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులను ధైర్యంగా ప్రజలకు చెబుతున్నామని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిని ప్రజలంతా గమనించాలని పురందేశ్వరి వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా అండగా నిలిచిందనీ.. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు మేలు చేయాలనే దిశగానే పాలన జరగాలని వెల్లడించారు. ఏపీకి 25 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందన్న పురందేశ్వరి.. ఇంటి స్థలాలు, ఇళ్లు.. ఎందరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు పేదల వద్ద డబ్బు తీసుకుని స్థలాలకు పట్టాలు ఇస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు. కేంద్రం ఇచ్చే బియ్యంపైనా జగన్‌ ఫొటోలు పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక పాలన వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదని, ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఏపీ నుంచి పారిపోతున్నారని ఆమె ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.