ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@9am

author img

By

Published : Jan 3, 2023, 9:00 AM IST

9am topnews
ప్రధానవార్తలు9am

..

  • ఇదేం పెద్దరికం పెద్దిరెడ్డి.. నువ్వే పాడి రైతులను దోచుకుంటే ఎలా..?
    Shiva Shakthi Dairy: పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రాష్ట్రంలోని సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ పాల ధరలను మరీ తగ్గించి రైతులను దోచుకుంటోంది. ఇతర డెయిరీలనూ గ్రామాల్లోకి అడుగు పెట్టనీయడం లేదు. దీంతో ధర లేక పాడి రైతులు దిగాలు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ‘కన్నా.. ఇక రాను బాగా చదువుకోండి’
    Father Suicide: ‘కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను. మీరు మేడమ్‌ వాళ్లు చెప్పినట్లు విని బాగా చదువుకోండి..’ అని తల్లిని కోల్పోయి ఐసీడీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో ఉన్న నలుగురు బిడ్డలతో తండ్రి చెప్పిన చివరి మాటలివి. భవిష్యత్తును విస్మరిస్తూ సోమవారం ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరకు పిల్లలను అనాథలను చేశాడు. ఈ హృదయ విదారకర ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అద్దెలు భరించలేక అక్కడికి వెళ్తే.. అన్నీ అరకొర సౌకర్యాలే..!
    AP govt Tidco houses structure updates: రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన టిడ్కో ఇళ్లపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరకొర వసతులతో టిడ్కో ఇళ్లను నిర్మించి అందజేయడంతో నానా అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిడ్కో భవనాల ముందు చెట్లు పెరిగి పాములు సంచరిస్తున్నాయని, వీధుల్లో రాత్రిపూట లైట్లు వెలగక.. దొంగాల భయంతో భయాందోళన చెందుతున్నామని వాపోతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక అనేక ఇబ్బందులు పడుతున్నా, అధికారులు పడుతున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్​ పర్యటన.. స్కూళ్లకు సెలవు..
    CM Tour: ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పెన్షన్‌ కానుక పెంపుదల కార్యక్రమంలో పొల్గొననున్నారు. అక్కడ రోడ్ షోలో సీఎం జగన్‌ పాల్గొంటారు. తర్వాత బహిరంగసభలో మాట్లాడుతారు. ఈ కార్యక్రమానికి లక్ష మందిని సమీకరిస్తున్నారు. ఇందుకోసం 420 ఆర్టీసీ బస్సులు, 180 ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేశారు. అదే విధంగా జిల్లాలో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పట్టపగలే యువకుడిని కాల్చి చంపిన దుండగులు.. సరిహద్దులో విదేశీ యువకుడి హత్య!
    పట్టపగలే ఓ యువకుడిన కాల్చి చంపారు ఇద్దరు దుండగులు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బిహార్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, ఇదే రాష్ట్రంలో నేపాల్​ పౌరుడి మృతదేహం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్లాస్టిక్​ కవర్లలో వంట గ్యాస్​ నిల్వ.. దిగజారుతున్న పాక్​ ఆర్థిక స్థితి!
    Pakistan Economic Crisis : పాకిస్థాన్​లో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది. దీంతో సబ్సిడీ అందించే నిత్యావసర వస్తువులపై కోత పెడుతోంది. ఈ క్రమంలో ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్‌ ప్రజలు.. వంటగ్యాస్‌ను ప్లాస్టిక్‌ కవర్లలో నింపి నిల్వ చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అమెరికా రాకెట్లతో ఉక్రెయిన్‌ ఎదురుదాడి.. 400 మంది రష్యా సైనికులు మృతి
    ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థి దాడిలో పెద్దఎత్తున ప్రాణనష్టాన్ని చవిచూసింది. ఈ మేరకు రష్యా కుడా అంగీకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెరగనున్న ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు.. ఆ నిబంధనలే కారణం
    ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), రిఫ్రిజిరేటర్ల ధరలను పెంచేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఏసీల ధరలు 5-8 శాతం వరకు, రిఫ్రిజిరేటర్ల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. బీఈఈ కొత్త నిబంధనల వల్లే వీటి ధరలు పెరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'టెస్టుల్లోనూ సూర్య ఆడాలి... మూడు ఫార్మాట్లలో అతడు కీలకం'
    క్రికెట్లో ఓ రేంజ్​లో దూసుకుపోతున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్​లో అదరగొట్టాడు. దీంతో అతనికి టెస్టు క్రికెట్‌ కూడా ఆడే అవకాశం ఇవ్వాలని అని కోరుకుంటున్నాడు టీమ్​ఇండియా టీ20 కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'బాలకృష్ణ వ్యక్తిత్వం లార్జన్ దేన్ లైఫ్.. సినిమాలో అంతకంటే గొప్పగా..'
    'వీరసింహారెడ్డి'తో సంక్రాంతికి బాలయ్య సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిత్రం గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ రిషి పంజాబి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.