ETV Bharat / sports

IPL 2023 GT VS MI : దంచికొట్టిన గుజరాత్​.. సర్జరీ తర్వాత తొలిసారి స్టేడియంలో బుమ్రా

author img

By

Published : Apr 25, 2023, 9:48 PM IST

Updated : Apr 26, 2023, 6:46 AM IST

సర్జరీ తర్వాత ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్​ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి స్టేడియంలో మెరిశాడు. గుజరాత్​ టైటాన్స్​తో జరుగుతున్న మ్యాచ్​కు అతడు హాజరై సందడి చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్​లో గిల్ హాఫ్​ సెంచరీతో మెరిశాడు.

Gujarat Titans vs Mumbai Indians 35th Match
గిల్​ హాఫ్​సెంచరీ.. సర్జరీ తర్వాత తొలిసారి స్టేడియంలో బుమ్రా

టీమ్‌ఇండియా పేసర్, ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్​ జస్ప్రీత్ బుమ్రా చాలా రోజుల తర్వాత స్టేడియంలో కనువిందు చేశాడు. సర్జరీ తర్వాత తొలిసారి మైదానంలో అభిమానుల మధ్య సందడి చేశాడు. ముంబయి ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు హాజరయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.

టాస్ అనంతరం బుమ్రా తమ జట్టుకు చీర్స్ చెబుతున్న ఫొటోను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్​మీడియాలో తమ అధికార ట్విట్టర్ అకౌంట్​లో షేర్ చేసింది. 'బూమ్‌.. బూమ్.. బుమ్రా..' అంటూ క్యాప్షన్​ రాసుకొచ్చింది. దీంతో చాలా రోజుల తర్వాత బుమ్రాను చూసిన ముంబయి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా జట్టులోకి రావాలని ఆశిస్తున్నారు.

గత నెలలోనే అతడు గాయానికి సర్జరీ చేయించుకునేందుకు న్యూయార్క్​ పయనమయ్యాడు. కాగా గాయం కారణంగా గతేడాది జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ తోపాటు ఈ ఏడాది స్వదేశంలో జరిగిన అన్ని ద్వైపాక్షిక సిరీస్​లకు దూరమయ్యాడు. కానీ రీసెంట్​గా సర్జరీ చేయించుకున్న అతడికి మరింత విశ్రాంతి అవసరం. ప్రస్తుతం అతను బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం అతడు ఆడలేడు. అందుకే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కు కూడా అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది.

గత శుక్రవారమే అతడు ఎన్సీఏకు వెళ్లాడు. ఇక 2023లో భారత్​లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని బుమ్రా భావిస్తున్నాడు. 2016లో ఇండియన్ టీమ్ తరఫున అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పటి వరకూ 30 టెస్టులు, 72 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్ విజయాల్లోనూ అతడు కీలకపాత్ర పోషించాడు.

ఇక ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది గుజరాత్ టైటాన్స్​. గుజరాత్ బ్యాటర్లు ధనాధన్ ఇన్నింగ్స్​తో దంచికొట్టారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. శుభమన్​ గిల్ (56; 34 బంతుల్లో 7x4, 1x6) మెరుపులు మెరిపించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (46; 22 బంతుల్లో 2x4, 4x6), అభినవ్ మనోహర్ (42; 21 బంతుల్లో 3x4, 3x6), రాహుల్ తెవాతియా (20; 5 బంతుల్లో 3x6) చెలరేగి బ్యాట్​ను ఝళిపించారు. ముంబయి బౌలర్లలో పీయూష్ చావ్లా 2, అర్జున్ తెందుల్కర్, బెరెన్ డార్ఫ్, మెరిడీత్, కుమార్ కార్తికేయ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇదీ చూడండి: ipl 2023 MI VS GT : గిల్​ వర్సెస్​ అర్జున్​.. సారా సపోర్ట్​ ఎవరికో?

Last Updated : Apr 26, 2023, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.