ETV Bharat / sitara

'పుష్ప' సినిమాకు అనసూయ పారితోషికం ఎంతంటే?

author img

By

Published : Dec 23, 2021, 2:44 PM IST

Updated : Dec 23, 2021, 7:26 PM IST

Pushpa: ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ 'పుష్ప'లో ద్రాక్షాయని పాత్రలో మెరిసింది నటి, యాంకర్ అనసూయ. పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా.. మంగళం శ్రీను భార్యగా నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు ఆమెకు ఎంత రెమ్యూనరేషన్​ ఇచ్చారంటే?

pushpa anasuya
పుష్ప

Pushpa: 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా విమర్శకులు ప్రశంసలు అందుకుంది నటి, యాంకర్ అనసూయ. సుకుమార్​ దర్శకత్వంలోనే ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా నటించిన 'పుష్ప' సినిమాలో ద్రాక్షయనిగా మెరిసింది. అయితే పుష్ప తొలి భాగం విడుదలై పాజిటివ్​ టాక్​తో దూసుకుపోతుండగా, అందులో అనసూయ పాత్ర నిడివి తక్కువగానే ఉందని ప్రేక్షకులు అంటున్నారు. కానీ, పార్ట్​-2లో మాత్రం ఆమె పాత్ర కీలకంగా మారనుందని తెలుస్తోంది. ఫహాద్​ ఫాజిల్​తో కలిసి పుష్పరాజ్​పై ప్రతీకారం తీర్చుకునే విధంగా ద్రాక్షయని పాత్రను రూపొందిస్తున్నారట సుకుమార్.

pushpa anasuya
అనసూయ

'పుష్ప'లో మంగళం శ్రీను భార్యగా నటించింది అనసూయ. ఆమె ఆహార్యం కూడా వైవిధ్యంగా ఉంది. ఇక ఈ సినిమా కోసం దాదాపు 10 రోజుల పైగా షూటింగ్​ పాల్గొన్న అనసూయ.. రోజుకు సుమారు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల పారితోషికం తీసుకుందని సమాచారం. 'పుష్ప: ది రైజ్' పేరుతో పార్ట్​ 2 తెరకెక్కనుంది. ఫిబ్రవరి-మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: 'సెకండ్‌ హ్యాండ్‌ ఐటెమ్‌'.. ట్రోల్‌పై స్పందించిన సమంత

Last Updated :Dec 23, 2021, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.