ETV Bharat / science-and-technology

జూన్​లో బ్రాండెడ్ స్మార్ట్​ఫోన్స్​ రిలీజ్​.. వీటిపై ఓ లుక్కేయండి

author img

By

Published : Jun 6, 2023, 6:55 AM IST

Upcoming Mobiles in India : జూన్​ నెల స్మార్ట్​ఫోన్​ ప్రియులకు కనువిందు చేయనుంది. రియల్​మీ, ఒన్​ప్లస్​, ఐకూ, ఒప్పో తమ సరికొత్త ఫోన్లను మార్కెట్​లోకి విడుదల చేయనున్నాయి. రియల్​మీ 11 ప్రో సిరీస్​ 200మెగా పిక్సెల్​ ప్రైమరీ కెమెరాతో, 100వాట్​ ఛార్జింగ్​ కెపాసిటీతో వస్తూ ఉండగా, ఒన్​ప్లస్​ 11 మార్బుల్​ ఒడిస్సీ చాలా ప్రత్యేకంగా స్టోన్​ లైక్​ టెక్చర్​తో రానుంది.​ వీటి ఫీచర్స్​పై ఓ లుక్కేద్దాం.

upcoming phones in India
latest smartphones 2023

Upcoming Mobiles in India 2023 : గూగుల్​, సామ్​సంగ్​, ఐకూ, నోకియా లాంటి బ్రాండ్​లు ప్రతిష్టాత్మకమైన స్మార్ట్​ఫోన్లును మే నెలలో విడుదల చేశాయి. దీనిని కొనసాగిస్తూ ఈ జూన్​ నెలలో కూడా పాపులర్​ బ్రాండ్లకు చెందిన స్మార్ట్​ఫోన్లు భారత మార్కెట్​లోకి విడుదల కానున్నాయి.

Realme 11 Pro 5G Series
రియల్​మీ 11 ప్రో 5జీ ఈ జూన్​ 8న భారత మార్కెట్​లోకి విడుదల కానుంది. ఈ స్మార్ట్​ 5జీ ఫోన్​లో

  • డిస్​ప్లే: 6.7 ఇంచీల ఫుల్​ హెచ్​డీ + (1080x2412 పిక్సెల్స్​) కర్వ్​డ్​ డిస్​ప్లే, 360హెచ్​జెడ్​ టచ్​ సాంప్లింగ్​ రేట్​
  • ప్రోసెసర్​: ఆక్టా కోర్​ 6ఎన్​ఎమ్​ మీడియాటెక్​ డిమెన్సిటీ 7050
  • 12జీబీ ర్యామ్​
  • బ్యాటరీ కెపాసిటీ: 5000ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ + 67వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​
  • కెమెరా: రియల్​మీ 11 ప్రో స్పోర్ట్​లో - 100 మెగా పిక్సెల్​ డ్యూయెల్​ రియర్​ కెమెరా,
  • రియల్​మీ 11 ప్రో+లో 200 మెగా పిక్సెల్​ ట్రిపుల్​ రియర్​ కెమెరా యూనిట్​ ఉంటాయి.

ప్రీ ఆర్డర్​పై బంపర్​ ఆఫర్​
టిప్​స్టర్​ ట్విట్టర్​ లీక్​ ప్రకారం, యూజర్లు జూన్ 8 నుంచి జూలై 14 వరకు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా ప్రీ ఆర్డర్​ పెట్టిన యూజర్లకు రూ.4,499 విలువ చేసే రియల్​మీ వాచ్​ 2 ప్రోను ఉచితంగా ఇవ్వనుంది. దీనితో పాటు రియల్​మీ వివిధ బ్యాంకుల ద్వారా నో కాస్ట్​ ఈఎంఐ ఆఫర్లు కూడా అందించనుంది.

ముఖ్యంగా ఫ్లిప్​కార్డ్​లో ఈ రియల్​మీ 11 ప్రో 5జీ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. రియల్​మీ 11 ప్రో 5జీ, రియల్​మీ 11 ప్రో + 5జీ స్మార్ట్​ఫోన్ల ధరలు సుమారుగా రూ.20 వేలు, రూ.24 వేలు రేంజ్​లో ఉండొచ్చు అని మార్కెట్​ వర్గాల అంచనా.

iQOO Neo 7 Pro
జూన్​ నెలాఖరులోగా ఐకూ నియో 7 ప్రో భారత మార్కెట్​లో విడుదల కానున్నట్లు సమాచారం.

ఐకూ నియో 7 ప్రో ఫీచర్స్​:

  • డిస్​ప్లే: 6.78 ఇంచీలు, 120హెచ్​జెడ్​ ఎఫ్​హెచ్​డీ+ డిస్​ప్లే
  • ప్రోసెసర్​: క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8+ జెన్​ 1 చిప్​సెట్​
  • ర్యామ్​: 12జీబీ
  • స్టోరేజ్​: 256జీబీ
  • రియర్​ కెమెరా: 50ఎమ్​పీ+2ఎమ్​పీ
  • ఫ్రెంట్​ కెమెరా: 8ఎమ్​పీ
  • ఆపరేటింగ్​ సిస్టమ్​: ఆండ్రాయిడ్​ 13 బేస్డ్​ ఫన్​టచ్​ ఓఎస్​
  • బ్యాటరీ: 5000ఎమ్​ఏహెచ్​
  • 120వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​

Oppo F23 Pro
ఒప్పో ఎఫ్​ 23 ప్రో కూడా ఈ జూన్​లోనే ఇండియన్​ మార్కెట్​లోకి విడుదల కానుంది. దీనిని నలుగు, నీలం రంగు వేరియంట్లతో తీసుకువస్తున్నట్లు సమాచారం.

ఒప్పో ఎఫ్​23 ప్రో ఫీచర్స్​:

  • డిస్​ప్లే: 6.72 ఇంచీలు, 120హెచ్​జెడ్​ ఎఫ్​హెచ్​డీ+ డిస్​ప్లే
  • ప్రోసెసర్​: క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 695​ ఆక్టా కోర్​ ప్రోసెసర్​
  • ర్యామ్​: 8జీబీ
  • స్టోరేజ్​: 256జీబీ
  • రియర్​ కెమెరా: 64ఎమ్​పీ+8ఎమ్​పీ + 2ఎంపీ+ ఎల్​ఈడీ ఫ్లాస్​
  • ఫ్రెంట్​ కెమెరా: 16ఎమ్​పీ
  • 67 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​
  • బ్యాటరీ: 5000ఎమ్​ఏహెచ్​

ఈ సంవత్సరం మరిన్ని టాప్​ బ్రాండ్స్​కి చెందిన స్మార్ట్​ఫోన్లు భారత మార్కెట్​లోకి విడుదల కానున్నాయి. టెక్​ ప్రియులారా జర హుషారుగా ఉండండి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.