ETV Bharat / business

ట్విట్టర్ సీఈఓగా​ బాధ్యతలు స్వీకరించిన లిండా.. మరో వ్యక్తికి కీలక బాధ్యతలు

author img

By

Published : Jun 5, 2023, 10:52 AM IST

Updated : Jun 5, 2023, 11:31 AM IST

twitter-new-ceo-linda-yaccarino-takes-over-as-new-twitter-ceo-on-monday
ట్విట్టర్​ బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఈఓ

Twitter New CEO : లిండా యాకరినో.. ట్విట్టర్​ కొత్త సీఈఓగా సోమవారం బాధ్యతలను చేపట్టారు. ఇక ఆమె పూర్తిగా ట్విట్టర్​పైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. అంతకుముందు తాను పనిచేసిన సంస్థలో.. నమ్మకంగా ఉన్న వ్యక్తికి.. ట్విట్టర్​లో కీలక బాధ్యతలు అప్పగించారు లిండా.

Twitter New CEO : ట్విట్టర్​ కొత్త సీఈఓగా లిండా యాకరినో.. సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక నుంచి ట్విట్టర్ వ్యాపార కార్యకలాపాలను.. పూర్తిగా లిండా యాకరినో చూసుకోనున్నారు. ట్విట్టర్ నూతన సీఈఓగా నియమితురాలైన లిండా యాకరినో.. ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమెతో పాటు పనిచేసిన ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ వైస్​ ప్రెజిడెంట్​.. జో బెనారోచ్ కూడా తన టీంలో చేర్చుకున్నారు లిండా. జో బెనారోచ్.. లిండాకు ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. మరోవైపు ఎలాన్ మస్క్​ ప్రొడక్ట్‌ డిజైన్‌, కొత్త సాంకేతికపై దృష్టి సారించనున్నారు. దాంతో పాటు టెస్లా, స్పేస్​ ఎక్స్​పై ఆయన పూర్తి స్థాయిలో పని చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

"నేను ఓ భిన్నమైన వృత్తి సాహాసాన్ని ప్రారంభించనున్నాను. ట్విట్టర్ వ్యాపార కార్యాకలపాలపై దృష్టి సారించేందుకు ఆ బాధ్యతలను తీసుకుంటున్నాను. నా అనుభవం మొత్తాన్ని ట్విట్టర్​లో కేంద్రీకరించేందుకు ఎదురు చూస్తున్నాను. ట్విట్టర్ 2.0 నిర్మిచేందుకు.. టీం అందరితో కలిసి పని చేస్తాను." అని జో బెనారోచ్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం సీఈఓగా నియామకమైన అనంతరం.. లిండా యాకరినో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్​ 2.0ను నిర్మించేదుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎలాన్​ మస్క్​తో పాటు మిలియన్​ల యూజర్లతో కలిసి ట్విట్టర్​లో మార్పులు తెస్తానని ఆమె వెల్లడించారు.

ఎవరీ లిండా?
Twitter New Ceo Linda Yaccarino : ట్విట్టర్ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన లిండా యాకరినో.. ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగం ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. గత పన్నెండేళ్లుగా ఆమె అదే సంస్థలో పనిచేశారు. లిండా యాకరినో గత నెలలో ఓ ఈవెంట్​లో మస్క్‌ను ఇంటర్వ్యూ కూడా చేశారు. వాణిజ్య ప్రకటనల ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలపై ఎన్​బీసీలో చివరగా ఆమె పనిచేశారు. కంపెనీ ప్రవేశపెట్టిన ప్రకటనల ఆధారిత పికాక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌లో లిండా కీలక పాత్ర వహించారు. అంతకుముందు టర్నర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో లిండా యాకరినో 19 ఏళ్ల పాటు పనిచేశారు. యాడ్‌ సేల్స్‌ను డిజిటల్‌ రూపంలోకి మార్చడంలో లిండా కీలక పాత్ర వహించారు. పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఆమె.. లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ చదివారు.

Elon Musk Twitter : 2020 అక్టోబర్​ నెలలో​ 44 బిలియన్​ డాలర్లుకు ట్విట్టర్​ను కొనుగోలు చేశారు మస్క్. సంస్థ పగ్గాలు చేపట్టిన వెంటనే.. సీఈఓ పరాగ్ అగర్వాల్​తో సహా సంస్థలో పనిచేస్తున్న కీలక ఉద్యోగులను తొలగించారు. అనంతరం ట్విట్టర్​లో​ భారీ మార్పులకు స్వీకారం చుట్టారు. 2022లో డిసెంబర్​లో ట్విటర్​ సీఈఓగా మస్క్​ తప్పుకున్నారు. ఆ తరువాత 2023 మే నెలలో లిండా యాకరినోను కొత్త ట్విట్టర్ సీఈఓగా నియమించారు. తాజాగా లిండా ట్విట్టర్​ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.

Last Updated :Jun 5, 2023, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.