ETV Bharat / entertainment

Thalapathy 67కు ఊహించని టైటిల్‌.. ప్రోమో అదిరిందిగా!

author img

By

Published : Feb 3, 2023, 9:49 PM IST

ప్రముఖ తమిళ నటుడు విజయ్, లోకేశ్​ కనగరాజ్​ కాంబినేషన్​లో​ దళపతి67 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న సినిమాకు అధికారిక పేరును చిత్ర బృందం ఖరారు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రోమోను కూడా విడుదల చేసింది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే..

leo bloody sweet movie
leo bloody sweet movie

ప్రముఖ తమిళ నటుడు విజయ్​తో లోకేశ్​ కనగరాజ్​ యూనివర్స్​(LCU)లో భాగంగా ఓ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ తెరకెక్కిస్తున్నారు. 'విక్రమ్'​ సినిమాతో సంచలన విజయం అందుకున్న లోకేశ్.. ఇప్పుడు విజయ్​ను డైరెక్ట్​ చేస్తున్నారు. ఈ సినిమా 'దళపతి ​67' అనే వర్కింగ్​ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది 19 అక్టోబరు 2023న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. కాగా, ఈ సినిమా గురించి మరో అప్డేట్​ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు 'లియో: బ్లడీ స్వీట్‌' నామకరణం చేశారు. అందులో భాగంగా ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు.

అయితే, విజయ్‌ అభిమానుల్లో చాలామంది.. ఈ సినిమాకు ఇదివరకే 'రెడ్‌ కోడ్‌' అనే పేరు పెట్టుంటారంటూ దానికి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్​ మీడియాలో వైరల్‌ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు ఊహించని టైటిల్‌ పెట్టడం వల్ల సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కాగా, ఈ 'లియో: బ్లడీ స్వీట్‌'లో.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్​ దత్​ విలన్​గా నటిస్తున్నట్టు సమాచారం. తమిళ నటుడు విశాల్, దర్శకుడు గౌతమ్ మీనన్, మాజీ క్రికెటర్ ఎమ్ఎస్​ ధోనీ ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. త్రిష ఫీమేల్​ లీడ్​లో నటిస్తున్నారు. ఖైదీ నటులు నరైన్​, అర్జున్​ దాస్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్​​ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.