ETV Bharat / entertainment

సిరీస్​లో జక్కన్న ఎంట్రీ.. ఆ విషయంలో చాలా బాధ పడ్డారట!

author img

By

Published : Jan 20, 2023, 12:56 PM IST

ఆర్​ఆర్​ఆర్​ సినిమా వరుస అవార్డులను దక్కించుకోవడంపై ఇంటర్వ్యూలు ఇస్తున్న దర్శకధీరుడు రాజమౌళి.. తాను ఓ విషయంలో చాలా బాధపడినట్లు తెలిపారు. అదేంటంటే..

Rajamouli
RRR Oscar entry: ఆ విషయంలో రాజమౌళి చాలా భాద పడ్డారట!

బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​ చిత్రాల సంచలన విజయాలతో గ్లోబర్​ స్టార్​గా మారారు దర్శకధీరుడు రాజమౌళి. ఇండియన్​ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారు. ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వ శైలి, సృజన్మాతక ప్రయాణం తదితర ఆసక్తికర అంశాలతో ఓ డాక్యుమెంట్‌ సిరీస్‌ రూపొందనున్నట్లు అధికార్ ప్రకటన వచ్చింది. అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిల్మ్‌ కంపానియన్‌ సంస్థలు 'మోడ్రన్‌ మాస్టర్స్‌' పేరుతో ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. ఇందులో తొలి భాగంలో రాజమౌళి కనిపించనున్నారు.

చాలా భాదపడ్డా.. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం భారతదేశం తరఫున ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ సాధించకపోవడంపై తాను బాధపడ్డానని జక్కన్న అన్నారు. "దేశం తరఫు నుంచి అధికారికంగా ఎంట్రీ సాధించకపోవడం వల్ల నిరాశ చెందాను. అయితే ఎంట్రీ ఎందుకు సాధించలేకపోయాం అంటూ ఆలోచించే వ్యక్తిని కాదు. మనం ముందుకు సాగిపోవాలి. మన దేశం నుంచి లాస్ట్‌ ఫిల్మ్‌ షో ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నందుకు సంతోషిస్తన్నా. ఆర్‌ఆర్‌ఆర్‌ అధికారికంగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని విదేశీయులు కూడా అనుకుంటున్నారు. కానీ, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎలా ఉంటుంది? దాని నియమ నిబంధనలు ఏమిటి? అనేది నాకు తెలియదు. కాబట్టి దాని గురించి నేను కామెంట్‌ చేయాలనుకోవడం లేదు" అని జక్కన్న వివరించారు.

కాగా, ఆర్​ఆర్​ఆర్​లో సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు చేసి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, ఆస్టిస్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌, బోస్టస్‌ సోసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్‌ వంటి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకుంది. ఇక ఆస్కార్​ మాత్రమే మిగిలింది. అయితే ఈ సినిమాలోని నాటునాటు పాట ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో స్థానం దక్కించుకుంది. ఇకపోతే మన దేశం తరఫు నుంచి 10 చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌ కోసం పోటీ పడుతున్నాయి. జనవరి 24న నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాల పేర్లను ప్రకటించనున్నారు.

ఇదీ చూడండి: మహేశ్‌-రాజమౌళి సినిమా కోసం హాలీవుడ్‌ ఏజెన్సీ సీఏఏ.. అసలేంటది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.