ETV Bharat / entertainment

ప్రభాస్​ 'సాహో' యాక్షన్​ సీన్​పై నెట్​ఫ్లిక్స్​ సెటైర్​.. డార్లింగ్​ ఫ్యాన్స్​ ఫుల్​ ఫైర్​

author img

By

Published : Nov 6, 2022, 5:13 PM IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ హీరోగా నటించిన సాహో చిత్రం.. మూడేళ్ల క్రితం భారీ అంచనాల నడుమ రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా ఆ మూవీలోని ఓ సీన్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన నెట్‌ప్లిక్స్.. ఇదేం యాక్షన్ అంటూ ఎద్దేవా చేసింది. దీంతో డార్లింగ్​ ఫుల్​ ఫైర్​ అవుతున్నారు.

prabhas fans fires on netflix
prabhas fans fires on netflix

Prabhas Fans Netflix: సోషల్ మీడియాలో పోస్ట్​లు పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ట్రోలింగ్ ఓ రేంజ్​లో జరుగుతుంటోంది. సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్​ను అవమానించేలా పోస్ట్​లు పెడితే ఫ్యాన్స్ అసలు ఊరుకోరు. ఇప్పుడు ప్రభాస్​ను టార్గెట్ చేస్తూ నెట్​ఫ్లిక్స్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్​లో నెట్​ఫ్లిక్స్ సంస్థను ఆడేసుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే.. 'సాహో' సినిమాలో ప్రభాస్ కొండ మీద నుంచి లోయలోకి దూకే షాట్ ఒకటి ఉంటుంది. దాన్ని ట్విట్టర్ హ్యాండిల్​లో షేర్ చేసిన నెట్​ఫ్లిక్స్.. 'ఇదేం యాక్షన్..?' అంటూ వెటకారంగా ఒక క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ పెట్టింది నెట్​ఫ్లిక్స్ ఇండోనేసియా విభాగం. ఇండోనేసియా భాషలోనే ఆ క్యాప్షన్ పెట్టారు. దీన్ని గూగుల్​లో అనువదించి చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. 'సాహో' సినిమాను, ప్రభాస్​ను కించపరుస్తున్నట్లుగా ఉండడంతో నెట్​ఫ్లిక్స్​పై యుద్ధం ప్రకటించారు!.

'అన్‌సబ్‌స్క్రైబ్ నెట్​ఫ్లిక్స్' అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను వదులుకుంటున్నట్లు స్క్రీన్ షాట్స్ తీసి మరీ పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది నెట్​ఫ్లిక్స్​కు పెద్ద డ్యామేజ్ అనే చెప్పాలి. ప్రభాస్ లాంటి స్టార్ హీరోను నెట్​ఫ్లిక్స్ టచ్ చేయకుండా ఉండాల్సిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 'సాహో' సినిమా నిరాశపరిచినప్పటికీ.. భారీ కలెక్షన్స్​ను రాబట్టింది. యాక్షన్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ తో సినిమాను రూపొందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.