ETV Bharat / entertainment

అభిమానులకు షాక్​ ఇచ్చిన ప్రముఖ సింగర్​.. అవన్నీ 'డిలీట్'​

author img

By

Published : Jul 19, 2022, 9:29 PM IST

Adnani sami Goodbye social media:ప్రముఖ సింగర్​ అద్నాన్​ సమీ అభిమానులకు షాక్ ఇచ్చారు. సోషల్​మీడియా నుంచి తప్పుకున్నారు.

Adnan Sami deletes insta
అభిమానులకు షాక్​ ఇచ్చిన అద్నాన్​ సామి

Adnani sami Goodbye social media: ప్రముఖ బాలీవుడ్ సింగర్​ అద్నాన్​ సమీ అభిమానులకు షాక్ ఇచ్చారు. సోషల్​మీడియా ఇన్​స్టా నుంచి తప్పుకున్నారు. తన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. 'అల్విదా' అని క్యాప్షన్​ జోడించారు. అయితే ఎందుకు ఇలా చేశారో చెప్పలేదు. ప్రస్తుతం ఈ విషయం హాట్​ టాపిక్​గా మారింది. దీంతో ఆయన అభిమానులు కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఏమైంది సార్​ అంటూ, ఎలా ఉంది మీకు, ఏమైనా జరిగిందా, బాగానే ఉన్నారా? అంటూ విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే కొంటమంది మాత్రం సాంగ్​ ప్రమోషన్​ కోసం పబ్లిసిటీ స్టంట్​ అని అంటున్నారు.

కాగా, అద్నాన్​ సమీ లండన్​లో పుట్టారు. ఆ తర్వాత ఇక్కడ పాటలు పాడి బాగా పాపులర్​ అయ్యారు. ఆయనకు భారత పౌరసత్వం కూడా లభించింది. 2020లో ప్రతిష్టాత్మక అవార్డు కూడా వరించింది. ఆయన కెరీర్​లో పలు స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో సూపర్​హిట్​ పాటలు పాడారు.

ఇదీ చూడండి: క్రేజీ ఫ్యాన్స్.. అభిమాన హీరో కోసం 'వెయ్యి' అడుగుల బ్యానర్.. హైవేపై రోడ్​ షో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.