ETV Bharat / city

వారిని రక్షించేందుకే జగన్ తాపత్రయం: బొండా ఉమా

author img

By

Published : Jun 9, 2022, 5:35 PM IST

బొండా ఉమా
బొండా ఉమా

TDP on Jagan: సొంత బాబాయిని చంపిన నిందితులను రక్షించేందుకు జగన్ తాపత్రాయపడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా దుయ్యబట్టారు. గంగాధర్​రెడ్డిది సాధారణ మరణం కాదని.., అవినాశ్ రెడ్డి పేరు బయటకు రాకుండా ఉండడం కోసమే గంగాధర్​రెడ్డిని చంపేశారని ప్రచారం జరుగుతోందని చెప్పారు.

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వాళ్లు పిట్టల్లా రాలిపోతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా వ్యాఖ్యనించారు. వివేకా కేసులో సాక్షులను చంపేస్తారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని.. ఇప్పుడు అదే జరుగుతోందని ఆరోపించారు. హత్య కేసులో పాత్ర ఉందనే అనుమానం ఉన్న కటికం శ్రీనివాసరెడ్డి, వివేకా మృతదేహానికి కుట్లు వేసిన జగన్ మామ గంగిరెడ్డి చనిపోయారన్నారు. ఇప్పుడు గంగాధర్​రెడ్డి కూడా అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని ఉమా వ్యాఖ్యనించారు.

గంగాధర్​రెడ్డిది సాధారణ మరణం కాదని.., అవినాశ్ రెడ్డి పేరు బయటకు రాకుండా ఉండడం కోసమే గంగాధర్​రెడ్డిని చంపేశారని ప్రచారం జరుగుతోందని చెప్పారు. సొంత బాబాయిని చంపిన నిందితులను రక్షించేందుకు జగన్ తాపత్రాయపడుతున్నారని దుయ్యబట్టారు. వివేకా కేసు దర్యాప్తులో భాగంగా పులివెందులలోని సీఎం జగన్, ఎంపీ అవినాశ్ ఇంటికి కొలతలు వేశారని అన్నారు.

Suspicious Death: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. నిద్రపోయిన సమయంలో అనారోగ్యంతోనే గంగాధర్‌రెడ్డి మృతి చెందినట్లు అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే మూడుసార్లు గంగాధర్‌రెడ్డిని విచారించింది. ఆయన మృతి నేపథ్యంలో క్లూస్‌ టీమ్‌ కూడా రంగంలోకి దిగి ఇంటి పరిసరాలను పరిశీలిస్తోంది.

వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి అనుచరుడు. అయితే.. గంగాధర్ రెడ్డి స్వగ్రామం పులివెందుల కాగా.. ప్రేమ వివాహం చేసుకుని యాకిడిలో ఉంటున్నారు. తనకు ప్రాణముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని రెండుసార్లు ఎస్పీని కలిసిన గంగాధర్‌రెడ్డి.. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ గతంలో ఫిర్యాదు చేశారు.

ఇవీ చూడండి

Suspicious Death: వివేకా హత్యకేసు.. సాక్షి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతి

Lokesh: లోకేశ్​ జూమ్​ మీటింగ్​లో వైకాపా ఎమ్మెల్యేలు వంశీ, కొడాలి నాని

ఘనంగా నయన్- విఘ్నేశ్​ పెళ్లి.. వేడుకలో రజనీ,షారుక్​ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.