ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM

author img

By

Published : Jun 27, 2022, 6:56 AM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

.

  • నేడు అమ్మఒడి నిధుల జమ.. బటన్ నొక్కనున్న సీఎం జగన్
    CM Jagan Srikakulam Tour: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. నవరత్నాల్లో భాగంగా వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మఒడి పథకానికి... ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మఒడి పథకం ద్వారా 2 లక్షల 150 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • లీజుకు క్వార్టర్లు.. ఏటా రూ.10 కోట్ల ఆదాయం అంచనా..
    Employees buildings lease in amaravati: అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్యోగుల కోసం నిర్మించిన గ్రూప్ డి భవనాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌డీఏ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. విట్ యునివర్సిటీకి ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఏడాదికి 8నుంచి 10కోట్ల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఈ నెల 28న తెలంగాణలో ఇంటర్​ ఫలితాలు విడుదల
    TS Intermediate Results 2022: తెలంగాణలో ఈ నెల 28న ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్​ బోర్డు ప్రకటించింది. జవాబు పత్రాల మూల్యాంకనం సహా అన్ని ప్రక్రియలు పూర్తయిన సందర్భంగా తప్పులు రాకుండా సాఫ్ట్​వేర్​ ద్వారా పరిశీలిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అగ్నిపథ్​ నిరసనలు.. మరోవైపు దరఖాస్తుల వెల్లువ.. వాయుసేనకు 3 రోజుల్లోనే!
    IAF Agnipath scheme: దేశవ్యాప్తంగా అగ్నిపథ్​కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో వాయుసేనకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. కేవలం నియామక ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయని వాయుసేన అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నేడు యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌.. విజయ్​చౌక్​లో విపక్ష నేతల భేటీ
    president election 2022: విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు నామినేషన్‌ వేయనున్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉండనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ముర్ము' స్వగ్రామానికి కరెంట్.. ఏళ్లుగా పడుతున్న బాధలకు మోక్షం​!
    Murmu Village Electricity: ఇన్నాళ్లుగా ఆ గ్రామంలో కరెంటు లేదు. చీకట్లోనే మగ్గుతూ కాలం వెళ్లదీశారు జనం. అయితే ఉన్నట్లుండి.. రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్​ స్తంభాలు, ట్రాన్స్​ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. కారణం ద్రౌపది ముర్మును భాజపా.. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. ముర్ము స్వగ్రామమే మరి ఇది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచాన్ని నడిపేది మనమే'
    PM MODI SPEECH IN GERMANY: నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్.. వెనుకబడిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జర్మనీలో భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. వలస ప్రాంతంగా ఉండటం వల్ల తొలి పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను దేశం పొందలేకపోయినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అతి త్వరలోనే ఈ-పాస్‌పోర్ట్‌లు.. డేటా పూర్తిగా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
    E Passport India: పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా ఈ-పాస్‌పోర్ట్‌లు తీసుకొస్తున్న కేంద్రం.. ఇవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే విషయంపై కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరి నాటికి వీటిని జారీ చేయనున్నట్లు తెలిపింది. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మేం బాగా ఆడితే సీనియర్లు తట్టుకోలేరు: పాక్​ బ్యాటర్​
    Pakisthan batter Ahmed Shehzad: పాకిస్థాన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెజాద్‌ షాకింగ్ కామెంట్స్​ చేశాడు. ఒకరు విజయవంతమైతే తమ సీనియర్లు తట్టుకోలేరని, వారు సంతోషంగా ఉండలేరని విమర్శలు చేశాడు. టీమ్​ఇండియాలో ధోనీ ఉండటం వల్లే కోహ్లీ బాగా రాణించాడని, కానీ తమ జట్టులో మహీలాగా ప్రోత్సహించే ప్లేయర్స్​ లేరని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ పని చేయడం ఇష్టంలేదు.. కానీ వారి వల్లే అలా..: పృథ్వీరాజ్​
    Prithviraj Sukumaran Kaduva movie: మలయాళ స్టార్‌గా దక్షిణాదిలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. త్వరలోనే 'కడువా' చిత్రంతో అభిమానుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా చిత్ర సంగతులను తెలిపారు. ఆ వివరాలివీ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.