ETV Bharat / city

నేడు అమ్మఒడి నిధుల జమ.. బటన్ నొక్కనున్న సీఎం జగన్

author img

By

Published : Jun 27, 2022, 4:52 AM IST

Updated : Jun 27, 2022, 6:26 AM IST

CM Jagan Srikakulam Tour: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. నవరత్నాల్లో భాగంగా వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మఒడి పథకానికి... ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మఒడి పథకం ద్వారా 2 లక్షల 150 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని వెల్లడించారు.

CM Jagan
CM Jagan

CM Jagan Srikakulam Tour: రాష్ట్రంలో 6594.6 కోట్లు... 43.96 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో... శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి ఈరోజు కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మఒడి పథకం 2 లక్షల 150 మంది విద్యార్థులు లబ్దిపొందనున్నారు.

ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు కోడిరామ్మూర్తి మైదానానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మఒడి పథకం లబ్ధిదారులతో మాట్లాడతారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తిరిగి పయనమై 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 27, 2022, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.