ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : Jun 26, 2022, 8:57 AM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

.

  • CJI Justice NV Ramana: "పట్టుబట్టి మరీ.. నా నేమ్‌ప్లేట్‌ తెలుగులో పెట్టించా.."
    CJI Justice NV Ramana: అమెరికా పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.. ఇవాళ వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృ భాషను, సంస్కృతిని, కన్నతల్లిని ఎప్పుడూ గుర్తుచేసుకోవాలని ఎన్​ఆర్​ఐలకు సీజేఐ సూచించారు. సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన గురించి వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆత్మకూరు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
    నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో.. అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొత్తం 20 రౌండ్లతో ఓట్ల లెక్కింపు ముగియనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Probation: జులై 1 నుంచి ప్రొబేషన్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
    Probation: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారుపై.. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శుల మూలవేతనం రూ.23,120 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వైకాపాను ప్రశ్నిస్తే బంధించారు.. మహిళ కన్నీటి వేదన!
    గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. నెల రోజుల క్రితం మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లా అల్లూరుకు వెళ్లారు. సమస్యలు పరిష్కరించాలని కవిత అనే మహిళ మంత్రిని నిలదీస్తే.. అప్పటినుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. మంత్రి అనుచరులు కవిత ఇంటికి తాళం వెేసి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. అధికారులే షాక్​!
    బిహార్‌లోని పట్నాలో విజిలెన్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో రూ.3 కోట్ల అక్రమ నగదు బయటపడింది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేందర్‌ కుమార్‌ ఇల్లు, కార్యాలయాలపై శనివారం ఏక కాలంలో దాడి చేసిన విజిలెన్స్‌ అధికారులు.. నగదుతో పాటు, కిలో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఫ్రీ ఫైర్​'లో బాలికతో పరిచయం.. ఖతర్ నుంచి వచ్చి కిడ్నాప్.. నేపాల్​కు తీసుకెళ్తుండగా..
    Qatar man kidnaps minor: ఆన్​లైన్ గేమ్​లో బాలికతో పరిచయం పెంచుకున్న ఓ ఖతర్ వాసి.. ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. బాలికను బ్లాక్​మెయిల్ చేసి అపహరించుకుపోయాడు. నేపాల్​కు వెళ్లేందుకు ప్లాన్ వేసుకోగా.. మధ్యలోనే పోలీసులు వారిని అడ్డగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అమెరికాలో తుపాకీ సంస్కృతికి చెక్‌.. ఆ చట్టంపై బైడెన్​ సంతకం
    Gun violence bill: ఎప్పుడెప్పుడా అని అమెరికన్లు ఎదురుచూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తుపాకీ నియంత్రణ చట్టంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సంతకం చేశారు. ఈ చట్టంతో ప్రాణాలు రక్షిస్తామని.. శ్వేతసౌధంలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • గృహరుణ ఒప్పందంపై సంతకం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
    జీవితంలో అతి పెద్ద పెట్టుబడి సాధారణంగా ఇంటిపైనే ఉంటుంది. సొంతింటి కోసం రుణం తీసుకోవడం అంటే ఒక దీర్ఘకాలిక ఒప్పందాన్ని కొనసాగిస్తున్నట్లే. ఈ అప్పు తీసుకునే తొందరలో చాలామంది కొన్ని ప్రాథమిక విషయాలను విస్మరిస్తుంటారు. ఒకసారి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత వాటిని భరించక తప్పదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • చరిత్ర సృష్టించిన తెలుగుతేజం.. ఆర్చరీ ప్రపంచకప్​లో స్వర్ణం
    పారిస్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్​లో జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ జోడీ రికార్డు సృష్టించింది. మిక్స్‌డ్‌ విభాగంలో స్వర్ణంతో చరిత్ర లిఖించింది. అంతేకాక వ్యక్తిగత విభాగంలో రజతం సొంతంచేసుకుంది జ్యోతి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రణ్​బీర్​ మొదటి భార్య ఆలియా కాదట.. ఆమె కోసం ఇంకా ఎదురుచూపులు!
    Aliabhatt Ranbirkapoor: ఇటీవలే వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్​ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేశారు. ఆలియా భట్​ తన మొదటి భార్య కాదని, తొలి భార్య కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.