ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : Jun 27, 2022, 8:59 PM IST

9pm Top news
9pm Top news

.

  • మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉంది: సీఎం జగన్‌
    సమాజం, దేశం, మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉందని..ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేవలం జగనన్న అమ్మఒడి కింద ఇప్పటి వరకు రూ.19,618 కోట్లు జమ చేశామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ ముఖ్యమంత్రికి ఆ హక్కు ఎక్కడిది: చంద్రబాబు
    రాజధాని అమరావతి పరిధిలో ఉద్యోగుల కోసం నిర్మించిన ఇళ్లను ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇవ్వడం సరికాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిని శ్మశానమని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని చంద్రబాబు నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే.. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం'
    ప్రభుత్వ తీరుపై అమరావతి రైతులు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులతో చర్చలు జరిపిన తర్వాతే.. రాజధాని భూములను వేలం వేయాలని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే కచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పంచముఖ మహా లక్ష్మీగణపతిగా.. ఖైరతాబాద్‌ గణేశ్​
    ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్​లోని ఖైరతాబాద్‌ మహా గణపతి ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు. పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శిందే వర్గానికి సుప్రీంలో ఊరట.. అప్పటివరకు పదవులు సేఫ్​!
    మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్​ అనర్హత వేటు నోటీస్ పంపడాన్ని సవాల్ చేస్తూ ఏక్​నాథ్ శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై స్పందన తెలపాలని శివసేన నాయకులు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​, కార్యదర్శి, కేంద్రానికి నోటీసులు పంపింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యశ్వంత్ సిన్హా నామినేషన్​..
    విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ వేశారు. ఆ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అ దేశంలో అందరికీ వర్క్ ఫ్రం హోం.. స్కూళ్లు బంద్​
    శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇంధనాన్ని దిగుమతి చేసుకునే స్తోమత లేక ప్రభుత్వం వినియోగాన్ని భారీగా తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది. రాజధాని కొలంబోలోని పాఠశాలను వారం రోజులపాటు మూసివేసింది. ప్రభుత్వ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టాక్​ మార్కెట్లకు లాభాలు.. సెన్సెక్స్​ 456 ప్లస్​
    దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్ఛేంజీ- సెన్సెన్స్​ 456 పాయింట్లు వృద్ధి చెంది 53 వేల 184 వద్ద ముగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐర్లాండ్​తో మ్యాచ్​లో భువి అరుదైన రికార్డు
    ఐర్లాండ్​తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో భారత పేసర్​ భువనేశ్వర్​ రికార్డు సృష్టించాడు. పవర్​ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా ఘనత సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ​హరీశ్​శంకర్​తో సినిమా.. బన్నీ-రామ్​.. చేసేదెవరు?
    దర్శకుడు హరీశ్​ శంకర్.. హీరో అల్లుఅర్జున్​తో ఓ సినిమా చేయనున్నారని నిన్నమొన్నటి వరకు ప్రచారం సాగింది. అయితే హరీశ్​.. ఇప్పుడీ ప్రాజెక్ట్​ కోసం రామ్​పోతినేనితో కమిట్​ అయ్యారని తెలిసింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.