ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లకు లాభాలు.. సెన్సెక్స్​ 456 ప్లస్​

author img

By

Published : Jun 27, 2022, 9:26 AM IST

Updated : Jun 27, 2022, 3:38 PM IST

stock market live updates
స్టాక్​ మార్కెట్లు

15:37 June 27

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్ఛేంజీ- సెన్సెన్స్​ 456 పాయింట్లు వృద్ధి చెంది 53 వేల 184 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ- నిఫ్టీ 132 పాయింట్లు మెరుగుపడి 15 వేల 832 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ఉండటం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.
ఎల్​అండ్​టీ, హెచ్​సీఎల్​ టెక్ షేర్లు​ రెండున్నర శాతానికి పైగా లాభాపడ్డాయి. టెక్​ మహీంద్రా, ఇన్ఫీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఏషియన్​ పెయింట్, భారతీ ఎయిర్​టెల్​, టాటాస్టీల్​ షేర్లు కూడా వృద్ధి చెందాయి. టైటాన్​, రిలయన్స్​, కొటాక్​ బ్యాంక్​ అతిస్వల్పంగా నష్టపోయాయి.

09:20 June 27

స్టాక్​ మార్కెట్లకు లాభాలు.. సెన్సెక్స్​ 456 ప్లస్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 600లకు పైగా పాయింట్లతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 15,800 ఎగువన ట్రేడవుతోంది.

  • ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 604 పాయింట్ల లాభంతో 53,332 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 183 పాయింట్ల వృద్ధితో 15,882 వద్ద ట్రేడవుతోంది.
  • పాజిటివ్​లోనే.. హిందాల్కో, హెచ్​సీఎల్​ టెక్​, ఇన్​ఫోసిస్​, ఎంఅండ్​ ఎం, పవర్​ గ్రిడ్​లు దాదాపు 2 శాతానికిపైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
Last Updated : Jun 27, 2022, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.