ETV Bharat / city

ఈ ఏడాది పంచముఖ మహా లక్ష్మీగణపతిగా.. ఖైరతాబాద్‌ గణేశ్​

author img

By

Published : Jun 27, 2022, 7:12 PM IST

Khairtabad Ganesh idol 20222: ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్​లోని ఖైరతాబాద్‌ మహా గణపతి ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు. పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది.

Khairtabad Ganesh idol
Khairtabad Ganesh idol

Khairtabad Ganesh Idol 2022 Released: దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన గణేశుడిగా పేరొందిన హైదరాబాద్​లోని ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి శ్రీపంచముఖ మహా లక్ష్మీగణపతి పేరుతో కొలువుదీరనున్నాడు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధిన వివరాలను గణేశ్ ఉత్సవ కమిటీ వెల్లడించింది. దానితో పాటు.. వినాయకుడి విగ్రహం నమూనా చిత్రాన్ని గణేశ్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. విగ్రహం 50 అడుగుల ఎత్తు ఉండనుంది. వినాయకుడికి ఎడమ వైపున శ్రీషణ్ముఖ సుబ్రహమణ్యా స్వామి, కుడివైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రి దేవి కొలువుదీరనున్నారు. గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రత్యేకతలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.